అదిలాబాద్

సడలిన ఉద్రిక్తత... అడుగడుగునా పోలీసు నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 17: ఆదివాసీలు లంబాడాల మద్య రగులుతున్న వర్గపోరు వివాదం ఆదివారం కాస్త సద్దుమనిగింది. రెండు రోజుల కిందట ఉట్నూరు ఏజెన్సీలో చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు సమస్యాత్మక కేంద్రాల్లో నిఘా ముమ్మరం చేయడం, భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయడంతో ఏజెన్సీ పల్లెల్లో ఉద్రిక్తత క్రమంగా సద్దుమనుగుతోంది. ఆదివారం ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలో వారసంత నేపథ్యంలో ఇంటి గడప దాటి ప్రజలు సరకులు తెచ్చుకున్నారు. జిల్లా అంతటా 144 సెక్షన్ నిషేదాజ్ఞలు కొనసాగుతుండగా నిఘా నీడన పోలీసు బందోబస్తు మరింత పెరిగింది. ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లో గిరిజనుల మద్య నెలకొన్న వివాదం సంధర్భంగా అడుగడుగునా పోలీసు బలగాలను రంగంలో దించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, 13వ బెటాలియన్ పోలీసులతో పాటు నాలుగు జిల్లాల నుండి ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగి బందోబస్తు నిర్వహిస్తున్నాయి. అయితే బేతల్‌గూడలో చెప్పుల దండ వేసి కుమురంభీం విగ్రహాన్ని అవమానపర్చిన ఘటన నేపథ్యంలో మరుసటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విధ్వంసాలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో డిఐజిల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగింది.
ఆదివాసీలు అందోళన కాస్త సద్దుమనగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా, వాట్సాప్‌లో గిరిజనుల వివాదానికి సంబంధించి పుకార్లు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలను ఉమ్మడి జిల్లాలో నిలిపివేశారు. దీంతో ఉద్యోగులు, మీడియా కార్యాలయాలకు సమాచార వ్యవస్థ స్థంభించిపోయి ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది.
మరోవైపు ఆదివాసి గిరిజన నాయకులు, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావును పోలీసులు హైదరాబాద్‌లోనే ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకోవడంతో పాటు నాయకుల కదలికలపై నిఘా పెంచడంతో సాధారణ పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. కొత్తగా ముగ్గురు ఎస్పీలను కూడా బదిలీ చేయడం ద్వారా శాంతి భద్రతల పరిస్థితి జిల్లాలో సాధారణ స్థితికి చేరుకుంది. 144 నిషేదాజ్ఞలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.