అదిలాబాద్

శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 17: జిల్లాలో శాంతి బధ్రతల పునరుధ్దరణకు సహకరించాలని కుమరం జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కల్మేష్ సంగెన్‌వార్ ప్రజలను కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కల్మేష్ విలేఖర్లతో మాట్లాడారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరు పోలీసులకు తోడ్పాటు అందించాలన్నారు. హింసను ప్రేరేపించినా, పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమయ్యేందుకు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కాగా రెండు రోజలుగా జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటల వెనుక ఉన్న వారిని ఇంకా గుర్తించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.