అదిలాబాద్

ఆత్మరక్షణ కోసం కరాటే అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, డిసెంబర్ 17: ఆత్మ రక్షణ కోసం కరాటే క్రీడ అవసరం అని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవిణ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని తాపీ సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మణ్ రేణికుంట్ల ప్రవిణ్, వరంగల్ సీబీ సీఐడీ డీ ఎస్పీ పులియాల రవికుమార్‌లు ముఖ్య అథిదితిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. సీనియర్ క్రీడాకారులు తాండూరి నారాయణ రావు చిత్ర పటానికి పూల మాల వేసి రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా రేణికుంట్ల ప్రవిణ్ మాట్లాడుతూ కరాటు, కుంగ్ ఫూ క్రీడలకు ఎనలేని ఆదరణ ఉందని తెలిపారు. యువకులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. తాండూరి నారాయణ క్రీడల పట్ల అసక్తి చూపెట్టే వారని, ఆయన చాలా మంది క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తి చూపి వారికి క్రీడలునేర్పించే వారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు కరాటే క్రీడ నేర్చుకోవడం అభినందనీయం అన్నారు. మార్షలార్ట్స్ క్రీడ విద్యార్థులకు గుర్తింపు తీసుకు వస్తుందన్నారు. ఐదు సంవత్సరాల పిల్లల కూడా క్రీడల పట్ల ఆసక్తి చూపడం గర్వకారణం అన్నారు. క్రీడల పట్ల సహాయ సహాకారాలు అందిస్తామని ప్రవిణ్ తెలిపారు. అనంతరం సిబి సిఐడి డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లు బెల్లంపల్లి అని కొనియాడారు. సింగరేణి క్రీడాకారులు క్రీడల పట్ల ఎనలేని ఆసక్తి చూపుతున్నారని అన్నారు. క్రీడాకారులకు అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూనేటి సత్యనారాయణ, కౌన్సిలర్ సమూద్రాల శ్రీనివాస్, కరాటే,కుంగ్ ఫూ ఆసోసియేషన్ అద్యక్షులు జుల్‌ఫేకర్ అహ్మద్, అద్యక్షులు మోహన్, వర్కింగ్ ప్రసిడెంట్ విజ్జెగిరి రవి, కార్యదర్శి భూమయ్య, డైరక్టర్ వెంకటేష్, వైస్ ప్రసిడెంట్ ముల్కల్ల శంకర్, ఆర్గనైజర్ సురేష్ టోర్నమెంట్ ఆర్గనైజర్ భరత్ స్టంట్ మాస్టర్ రమేష్ రాజా, టీ ఆర్ ఎస్ నాయకులు రమేష్, అలవేని సంపత్, రమేష్, రామకృష్ణ, శేఖర్, ఏడుకొండలు, పాల్గొన్నారు.