అదిలాబాద్

ఇరువర్గాలు సంయమనం పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 17: గిరిజన తెగలు సంయమనం పాటించాలని, సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. విబేదాలు, ఘర్షణలు సమస్యల పరిష్కారానికి ఎంతమాత్రం పరిష్కారం కాదని మంత్రి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. ఆదివాసిలు, లంబాడీలు ఐకమత్యంతో ఉండాలని, తాత్కాలిక భావోద్వేగాలకు లోనుకాకుండా విచక్షణ పాటిస్తూ సంయమనంతో మెలగాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. విబేదాలను పక్కనపెట్టి గిరిజన తెగలు కలిసి మెలిసి ఉండాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్నివర్గాల ప్రాంతాల అభివృద్దికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమాన ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడించారు. ఆదివాసిలు, లంబాడాల అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఏదైన సమస్య ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారం ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య, ఆరోగ్య, తాగు,సాగునీరు, రోడ్లు వంటి వౌళిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.