అదిలాబాద్

ప్రతి అడుగు ప్రజల ప్రయోజనాలకోసమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్, ఏప్రిల్ 10: తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగు ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర గృహానిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని అనంతపేటలో మిషన్ కాకతీయ రెండవదశలో భాగంగా చెరువు పునరుద్దరణ పనులను ఆదివారం ప్రారంభించారు. మెదటగా లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభిస్తూ తట్టతో చెరువు పూడిక మట్టిని తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోమంత్రి మాట్లాడుతూ అనంతపేట చెరువు పునరుద్దరణకు రూ. 70 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దీంతో ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించడానికి అనుకూలమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40వేల చెరువులను మిషన్ కాకతీయలో పునరుద్దరణకు గుర్తించినట్లు పేర్కోన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల పునరుద్దరణతో వ్యవసాయ రైతుల కలల పంటలు సాకారమవుతాయన్నారు. తాగునీరు, సాగునీరుకు శాశ్వత పరిష్కారకోసం ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. శ్రీరాంసాగర్ ద్వారా నిర్మల్ ప్రాంత ప్రజలకు తాగునీరందించే పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి శుద్దజలం అందిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. మహరాష్ట్ర ప్రాజుక్టులతో పాటు మన నీటివనరుల వినియోగంపై ముమంత్రి చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో పవర్ పాయంట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని వినూత్న ఓరవడికి శ్రీకారం చుట్టారన్నారు. అభివృద్ధి పట్ల ఆయనకున్న విషయ పరిజ్ఞానంపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రశంసించారని వివరించారు. కనురెప్ప కాలం పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి రైతులు కోరినవిధంగా 9 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతపేటకు సబ్‌స్టేషన్ మంజూరుచేశారు. కార్యక్రమంలో సర్పంచి నర్సయ్య,మాజీ ఎంఎల్‌ఎ నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, ఎంపిపి సుమతి రెడ్డి, ఎంపిడివో గజ్జారాం, తహశీల్దార్ నారాయణ పాల్గోన్నారు.