అదిలాబాద్

నాగోబా జాతరకు వేళాయె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,జనవరి 14: గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదివాసీల నాగోబా జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చక చక సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చే ఆదివాసీ అతిథుల కోసం ఐటిడి ఏ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తమ ఆచార వ్యవహారాల్లో భాగంగా మెస్రం వంశీయులు జాతరకు రెండు రోజుల ముందుగానే మర్రిచెట్టు నీడన బస చేసి గో వాడలో విశ్రాంతి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నిన్నటి వరకు వెల వెలబోయిన కెస్లాపూర్ ప్రస్తుతం జాతర ఉత్సవాలతో సందడి చేస్తోంది. ఈనెల 16న పుష్య అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి నాగోబాకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం బుధవారం నుండి జాతర ప్రారంభం కానుండగా ఆదివారం జిల్లా కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఆదిలాబాద్ ఎంపి గెడం నగేష్ ఆదివారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. నాగోబా ఆలయ ప్రాంగణంలో దర్బార్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.95 లక్షల నిధులు మం జూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. అదే వి ధంగా రూ.55లక్షలతో కెస్లాపూర్ నుండి నాగోబా ఆ లయం వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. మర్రిచెట్ల వద్ద మెస్రం వంశీయులు సేదా తీరేందుకు కావాల్సిన ఏర్పాట్లను సైతం పూర్తిచేశారు. కోనేరును గత సంవత్సరమే నిర్మించగా దాని చుట్టూ కంచె నిర్మించి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ దివ్య, అసిస్టెంట్ కలెక్టర్ గోపి, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఎంపి గెడం నగేష్‌లు జాతర ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. జాతరకు వచ్చే ఆదివాసీ గిరిజనుల కోసం మంచినీటి వ్యవస్థతో పాటు తాత్కలిక మరుగుదొడ్లు, స్నానాల గదులు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో గోవాడకు సైతం రంగులు వేసి సిద్దం చేయగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం కెస్లాపూర్‌లోని గోవాడకు మెస్రం వంశీయులు చేరుకున్నారు. అదే విధంగా హత్తినమడుగులో గోదావరి జలాలు సేకరించి ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయంకు చేరుకున్న మెస్రం వంశీయులు ఇంద్రాయి దేవతకు తమ ఆచార సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుండి కెస్లాపూర్ నాగోబా జాతరకు తరలివస్తున్న మెస్రం వంశీయులు ముందుగా ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తున్నారు. మినుముల పప్పుతో తయారు చేసి వంటకాలను ఇంద్రాయి దేవతకు భక్తితో నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం పిల్ల పాపలతో కలిసి ఎడ్లబండ్లు, కాలి నడకన కెస్లాపూర్ నాగోబా జాతరకు తరలిరాగా మర్రిచెట్టు వద్దకు చేరిన మెస్రం వంశీయులు తమ వెంట తీసుకవచ్చిన గంగాజలంతో నాగోబా ఆలయంలోకి ప్రవేశించారు. అదే విధంగా గోదావరి జలాలు పవిత్రంగా భావిస్తూ భూమిపై పెట్టకుండా చెట్టుపై పెట్టడం విశేషం. మంగళవారం ఉ దయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మెస్రం వంశీయులు కొత్త కుండల కోసం ఆదివారం సిరికొండ మండల కేంద్రానికి చేరుకొని పూజలు చేసి అక్కడి నుండి కుండలు తీసుకవచ్చిన అనంతరం కోనేరు నీటిని సేకరించి ఆలయంలోకి ప్రవేశించారు. ఇదిలా ఉండగా ఈ నెల 16 నుండి ప్రారంభమయ్యే నాగోబా జాతరకు ప్ర యాణికుల సౌకర్యార్థం ఆర్టీసి అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైన జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానుంది.