అదిలాబాద్

పట్టుబడ్డ సబ్సీడీ గొర్రెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్పూర్‌టి, జనవరి 17 : ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా యాదవుల అభ్యున్నతి కోసం అందిస్తున్న సబ్సీ డీ గొర్రెలు పొరుగు రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుబడ్డ ఘటన బుధవా రం చోటు చేసుకుంది. కుంమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలానికి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లా గొండుపిప్రి తాలుక పరిధిలోని దాబ గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబందించి అందిన సమాచారం మ ంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన రాయమల్లు అనే వ్యక్తి ఏపి 15టి ఎ 4141 వాహనంలో 92 సబ్సీడీ గొర్రెలను సిర్పూర్‌టి మండలం వెంకట్రా వ్ పేట గ్రామం వద్ద గల పెనుగంగ వంతెన గుండ మహారాష్టక్రు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో కొండయ్య మహారాజ్ జాతర దర్శనం కోసం వెల్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ విషయం గమణించి వా హనాన్ని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్సీడీ గొర్రెలుగా అనుమానం రావడంతో అప్పటికప్పుడు సిర్పూర్‌టీ పోలీసులకు ఈ విషయంపై సమాచారం అందించారు. ఇదే విషయం పై సిర్పూర్ టి ఎస్ ఐ ప్రవిణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని వాహనం డ్రైవర్ సమ్మయ్య నుం డి సేకరించి వాహనం సహా, 92 గొర్రెలను సిర్పూర్ టి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం పై జిల్లా పశు స ంవర్థక శాఖ అధికారి కుమార స్వామికి సమాచారం అందించడంతో కాగజ్‌నగర్ సిర్పూర్ పశువైద్యాధికారులు తిరుపతమ్మ, విజయ్ లతో కలిసి జిల్లా పశువైద్యాధికారి సిర్పూర్ టి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ విషయం పై పూర్తి వివరాలు సేకరించారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమో దు అయిన నేపథ్యంలో అక్రమంగా తరలిస్తు పట్టుబడ్డ గొర్రెలను సిర్పూర్ టి మండలం చీలపల్లి గొర్ల పెంపకం దారులకు అప్పగించి కోర్టు తీర్పు వెలువడే దాక వాటి సంరక్షణ చేయాలని గొర్రెలకు పట్టుబడ్డ సబ్సీడీ గొర్రెలు ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా చూడటంతోపాటు ఏవైనా ఇబ్బందులు ఉంటే సిర్పూర్ టి ఎస్ ఐ సమాచారం అందించాలని సూచించారు. కాగా వ్యాను డ్రైవర్ స మ్మయ్య గొర్రెల తరలింపు పై మాట్లాడుతూ దాబ సమీపంలో గొర్రెలను మేత కోసం తీసుకువెల్తున్నామని పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వ సబ్సీడీ గొర్రెలు మహారాష్టక్రు తరలిస్తు ఎమ్మెల్యే చొరవతో పట్టుపడటం గమనార్హం.