అదిలాబాద్

డబుల్‌బెడ్‌రూం పనులను వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్,జనవరి 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అ త్యంత ప్రాధాన్యతనివ్వాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పరోగతిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధు లు, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలపై జిల్లాకలెక్టర్ ఎం.ప్రశాంతి, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ సత్యమూర్తితో కలిసి సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాకు ఎన్ని డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైనవి, వాటిలో ఎన్ని పూర్తయినవి, ఎన్నింటికి పరిపాలన మంజూరీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నింటికి టెండర్లు పిలవడం జరిగింది, మంజూరైన ఇళ్లకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం పూర్తయిందా మొదలగు విషయాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారీగా మంజూరైన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లకు ఇళ్లను కేటాయించారు. జిల్లాలో ఈనెల 31లోగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఫిబ్రవరి మొదటి వా రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమవంతు సహాయ సహకారాలను అందించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన భూ ములను అధికారులు వెంటనే అప్పజెప్పాలని రెవె న్యూ డివిజన్ అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని, కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, రూ.230లకే సిమెంట్ బస్తా ఇస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్‌తో త్వరలోనే సమావేశమై స్టీల్ ధరను కూడా తగ్గించేందుకు కృషిచేస్తామన్నారు. నిర్మల్ నియోజకవర్గానికి 1400, ముధోల్ నియోజకవర్గానికి 1400, ఖానాపూర్ నియోజకవర్గానికి 560, మొత్తం 3360 ఇళ్లుమంజూరు కాగా వీటిలో 2626 ఇళ్ల్లకు పరిపాలన అనుమతులను మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధుల కొరత లేదని, కాంట్రాక్టర్లకు వెంటనే నిధులను విడుదల చేస్తున్నామన్నారు. జీ ఎస్ట్భీరం పడుతుందనే అపోహలను కాంట్రాక్టర్లు వీడాలన్నారు. కాంట్రాక్టర్లు సామాజిక బాధ్యతగా తీసుకుని డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2620 ఇళ్లుకు పరిపాలనపరమైన మంజూరు ఇచ్చామని, ఇంకా 734 ఇళ్లకు ఇవ్వాల్సి ఉందన్నారు. 1740 ఇళ్లకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. 533 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయని, 45 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.2కోట్ల 68 లక్షలను ఖర్చుచేయడం జరిగిందన్నారు. జిల్లాకు
డబుల్‌బెడ్‌రూమ్ పథకం కింద రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి,ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్, గృహనిర్మాణ చీఫ్ ఇంజనీర్ సత్యమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ క్రాంతిరెడ్డి, ఆర్డీవోలు ప్రసూనాంభ, రాజు, జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రావు, ఎస్ ఈ, డి ఈలు, తహసిల్దార్లు, ప్రముఖ స్పెషల్‌క్లాస్‌వన్ కాంట్రాక్టర్ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డితోపాటు పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.