అదిలాబాద్

ఆదిలాబాద్‌లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 20: పగలు ఎండ.. రాత్రి చలితీవ్రతతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజులుగా జిల్లాలో 9 నుండి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా చలితీవ్రత పూర్తిగా తగ్గిపోతుందని అందరూ భావించగా శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయితే పగటి ఉష్ణోగ్రత మాత్రం 29 డిగ్రీలు నమోదు కావడం విశేషం. బోథ్, ఉట్నూరు, ఆసిఫాబాద్ కేంద్రాల్లో 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.