అదిలాబాద్

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 11: ప్రజల సమస్యలను తెలుసుకొని సత్వరమే స్పందిచనప్పుడే శాంతి భద్రతలను ముందస్తుగా కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్వర్యంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించగా పలు ప్రాంతాల నుం డి వచ్చిన ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీసు స్టేషన్ అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి కేసుల పరిష్కారానికై తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సంధర్భంగా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ పోలీసు శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పించడంతోనే పోలీసు విధుల్లో నాణ్యత పెరిగిందన్నారు. జిల్లా శాంతి భద్రతల పరిరక్షణకై నూతన సాంకేతిక పరిజ్ఞాణంను వినియోగిస్తున్నామని, జిల్లాలో మొదటిసారిగా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు విభాగంలో మహిళల నియామకం చేస్తున్నామని అన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టతను కాపాడే విధంగా ప్రతి పోలీసు స్టేషన్‌లను పచ్చదనంతో మొక్కలను నాటి ప్రజలతో మార్యదపూర్వకంగా మల్చుకునేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టామని అన్నారు. ప్రజలు సోషల్ మీడియా ద్వారా పోలీసు సేవలను వినియోగించుకోవాలని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తెలియజేసే విధంగా పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారులు బి.వెంకటస్వామి, జైస్వాల్ కవిత, కార్యాలయం అధికారులు యంఏ జోసెఫిన్, ఆర్. భారతి, యూనిస్ అలి, సులోచన తదితరులు పాల్గొన్నారు.