అదిలాబాద్

రైతులకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, ఫిబ్రవరి 18: ఇటీవలే ముధోల్ నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ యం. ప్రశాంతి అన్నారు. ఆదివారం భైంసా మండలంలోని హస్గుల్, ఇలేగాం గ్రామంలో భారీ వర్షానికి నష్టపోయిన పంటపోలాలను పరిశీలించారు. ముధోల్ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్టమ్రుఖ్యమంత్రి కేసీ ఆర్‌ను కలిసి పంటనష్టం వివరాలను తెలిపారు. భారీ వర్షానికి జోన్న, శనగ, మొక్కజోన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లగా ముఖ్యమంత్రి కార్యదర్శి నితాసబర్వాల్ అదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వనికి నివేదిక అందిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట ముధోల్ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి, తహశీల్దార్ సుభాష్ చందర్, జిల్లా స్థాయి వ్యవసాయ ఆధికారులు, తదితరులు ఉన్నారు.