అదిలాబాద్

లోక కల్యాణం కోసమే యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్సెట్టిపేట, ఫిబ్రవరి 18: లోక కళ్యాణార్థమే శ్రీ రుద్ర శత ఛంఢీయాగాన్ని నిర్వహించడం జరుగుతుందనని దీని వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలు అష్ట, ఐశ్వర్యాలతో ఉంటారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పెద్ద పల్లి మాజీ ఎంపి గడ్డం వివేకానంద అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న శ్రీ రుద్ర శత చండీ యాగానికి ఆయన రెండవ రోజు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభ కలశంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి వద్ద ఆయన ప్రత్యేక పూజాను చేశారు. వేధ పండితులు వివేకానందను ఈ సందర్బంగా శాలువాలతో ఆయన సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీ ఎం కేసి ఆర్ గత సంవత్సరం తన పుట్టిన రోజు సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశ్యంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాగాన్ని చేశారని దీని ఫలితంగా తెలంగాణ ప్రజలు సకల భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారని తెలిపారు. అనధికాలంలో మహిర్షిలు, రాజులు, చేయలేని గొప్ప సహాసాన్ని సి ఎం కేసి ఆర్ చేశారని దానివల్లనే నేడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఇదే అనావాయితీగా చూసుకోని ప్రజలంతా సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్రంలో శత చండీ యాగాలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ యాగం ప్రతిఫలం చేసిన వారికే తెలుస్తుందన్నారు. లక్సెట్టిపేటలో కూడా ఇంత వైభవంగా యాగం చేయడం గర్వకారణం అన్నారు. ఇంత పెద్ద యాగాన్ని చేపట్టిన నిర్వాహాకులను ఆయన అభినందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ వెంకటరావు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక, కర్షక సోదరులంతా ఉన్నారని వారు కుటుంబంలోని వారంత సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈరోజు యాగంలో న్యాయమూర్తి జయరాం రెడ్డి దంపతులతో పాటు, డిసి ఎం ఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు అలాగే మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చెన్ననాగభూషణం దంపతులతో మండల తెరాస అధ్యక్షుడు పోడేటి శ్రీనివాస్ గౌడ్ దంపతులు యాగంలో కూర్చున్నారు. పాటు సుమారు 80 మంది దంపతులు యాగంలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కట్ల చంద్రయ్య, సర్పంచ్ సుమతి శాంతికుమార్‌లతో పాటు దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల నాయకులు తిప్పని లింగయ్య, రాజమల్లయ్య, నారాయణ, ముత్తే సత్తయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.