అదిలాబాద్

పేదల అభ్యున్నతికి సర్కార్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 18: ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయా, న్యాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామంలో పలు ఆభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ సహకారంతో గ్రామంలో ఆదనపు తరగతి గదులను రూ 6.50లక్షలతో నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. రూ 13లక్షలతో గ్రామపంచాయతీ భవనం, 9లక్షలతో శ్మశాసన వాటిక పనులను ప్రారంభించడం అనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో రూ 5లక్షలతో నేషనల్ హైవేకు రోడ్డును కలపడానికి ప్రతపాదనలు పంపించామని తెలిపారు. అదేవిధంగా 21లక్షల, 96వేలతో మిషన్ కాకతీయ పథకం పనులను చేపడతున్నామని అన్నారు. నీలాయిపేట గ్రామంలోని ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవడానికి అవసరమైన నిధులు రూ 7లక్షలు విడుదల చేశామని పేర్కొన్నారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హల్, హనుమాన్ మందిరం, సేవాలాల్ మందిర ప్రహరి గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆధికారులను అదేశించారు. రూ 10లక్షల చొప్పున మంజూరు చేస్తానని అన్నారు. ప్రభుత్వం రైతులకు కొత్త సంవత్సరంలో వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తుందని వెల్లడించారు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణం చేపడతామని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ సీజన్ నుండి ఎకరానికి రూ 4ల చొప్పున్న ఆర్థిక సహయం అందిస్తుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతుల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహయం అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ దౌలన్‌బీ వౌలానా, నిర్మల్ పట్టణ తెరాస వైస్ ప్రెసిడెంట్ పాకాల రాంచందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, డీపీవో, స్థానిక తహశీల్దార్, నాయకులు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.