అదిలాబాద్

అసాంఘీక శక్తులపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, ఫిబ్రవరి 20: అసాంఘీ క శక్తులపట్ల అప్రమత్తంగా వ్యవహరి ంచాలని రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు. తిరా యణి మండలం గుండాల గ్రామంలో మంగళవారం గిరిజనులతో అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థుల కు దుస్తులు, వృద్దులకు దుప్పట్లు, దో మతెరలు, మహిళలకు చీరేలు, యువతకు క్రీడాసామాగ్రిని పంపిణి చేశారు. గిరిజనులతో కలిసి సిపి నృత్యాలు చే సి గిరిజనులను ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ అ సాంఘీక శక్తులపట్ల గిరిజనులు అప్రమత్తంగా వ్యవహరించాలని,అమాయ క గిరిజనులను మాయమాటలు చెప్పి అనేకరకాలుగా మోసం చేస్తారని వారి బారిన పడ్డవద్దని హితవుపలికారు. గి రిజనులు అసాంఘీకశక్తులకు దూరం గా ఉంటేనే గ్రామాలు అభివృద్ది చె ందుతాయని, యువత చెడు వ్యవసనాలకు బానిసలు కాకుండా సన్మార్గం లో నడవాలని కోరారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా నేరుగా మీరే జిల్లాస్థాయి అధికారులను కలిసి పనులను చక్కదిద్దుకోవాలని, అందరు స మిష్టిగా కృషి సలిపి అభివృద్ది చేసుకోవాలన్నారు. అభివృద్ది ఏఒక్కరివల్ల కాదని అన్నిరంగాలవారు కలిస్తేనే అ భివృద్ది సాధ్యమని ఆదిశగా ప్రతిఒ క్కరు కృషిచేయాల్సిన అవసరం ఉం దన్నారు. ఈ సందర్భంగా గతంలో గుండాల గ్రామానికి రోడ్డు సౌకర్యం లేని విషయాన్ని సిపి ప్రస్తావిస్తూ అ టవీ, రెవిన్యూ, ఐటిడిఏ అధికారులు సమిష్టిగా కృషి చేయడంవల్లనే రోడ్డు సౌకర్యం వచ్చిందని తెలిపారు. ఈ స ందర్భంగా రొంపెల్లి నుండి గుండాల కు రోడ్డు సౌకర్యం, గ్రామంలో తాగు నీటి కోసం బోర్లు వేయించాలని సిపి దృష్టికి గిరిజనులు తీసుకపోగా స ంబందిత జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి సమస్యలు తీర్చేందుకు కృ షిచేస్తానని హామీ ఇచ్చారు. గిరిజనుల తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి వేణుగోపాల్‌రావు, ఎసిపి చేతన, అసిఫాబాద్ డిఎస్పీ సత్యనారాయణ, బాలీవుడ్ నటుడు అభినవ్, లక్సెటిపే ట సిఐ ప్రతాప్, తిర్యాణి, జన్నారం ఎ స్సైలు శ్రీనివాస్, తాసీద్దున్, గిరిజన స ంఘం నాయకులు కోవ జంగు, కోవ హన్మంతరావు, రాజుగూడ ఉప సర్ప ంచ్ బాలకిషన్, అశోక్, దేవేందర్‌లు పాల్గొన్నారు.