అదిలాబాద్

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈనెల 22న బెల్లంపల్లి తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయులు ధర్నా చేపట్టనున్నారని పిఆర్ టియూ జిల్లా అధ్యక్షులు తిరుమల్ రె డ్డి, ఇన్నారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని బజార్ ఏరియా పాఠశాలలో ధర్నాకు సంబంధించిన గోడ ప్ర తులను విడుదల చేశారు. నూతన ఫి ంచన్ విధానం సిపిఎస్‌వల్ల ఉద్యోగు లు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఈవిధానాన్ని రద్దు చే యాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమా ర్లు విన్నవించినా పట్టించుకోవడం లే దని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగా ణ ప్రభుత్వంలో 2017లో పిఆర్‌సి ఇ వ్వడంతప్ప ఉపాధ్యాయులకు సం బంధించి ఏఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి.చెన్నకేశవులు, ప్రధాన కార్యదర్శి లతీఫ్, రాష్ట్ర మండల బాధ్యుల జి.ల క్ష్మణ్, స్నేహలత, శ్రీదేవి, రాష్ట్ర, జిల్లా బాధ్యులు కె.కృష్ణమూర్తి, పి.రాధ లత, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ బాయి, సత్యనారాయణ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అమ్మ..
దండేపల్లి, ఫిబ్రవరి 20: తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలో పదాలు లేవు. బిడ్డ ఆకలిని తీర్చడానికి తల్లి ఎంతో ఆరాటపడుతుంది. చిన్నారి కడుపునిండినప్పుడే అమ్మ కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తిర్యాణి మండలం గుండాల గిరిజనగూడెంలో పోలీసుల అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అందరి తో కలిసి సహపంక్తి భోజనం చేస్తు పక్కనే కుర్చున్న చిన్నారికి గోరుముద్దలు తినిపించి తన మాతృత్వ ప్రేమను చాటింది మంచిర్యాల ఇంచార్జీ ఎసిపి చేతన.
11న మాల వివాహ పరిచయ వేదిక
ఉట్నూరు, ఫిబ్రవరి 21: మాల సంఘం అధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక మార్చి 11న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ మిట్టు ప్రహ్లాద్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మాల సంఘం అధ్వర్యంలో ఇంత వరకు వివాహ పరిచయ వేదిక నిర్వహించలేదని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని మాల కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినతర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారని, కాని అది ఇప్పటికీ నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకొని దళితులకు న్యాయం చేయాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ దళితులకు మూడెకరాల భూమి సంకటంగా మారుతుందని, పట్టాలు కానందున మైదాన ప్రాం తంలో ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో నాయకులు సింగారి అశోక్, రమేష్, ఊశన్న, స్వామి, దేవానంద్, ఏ సన్న, మధు, బలవంత్ తదితరులు పాల్గొన్నారు.