అదిలాబాద్

ఏజెన్సీ సర్ట్ఫికెట్లు రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఫిబ్రవరి 21: వలస వచ్చి ఏజెన్సీ ధృవపత్రాలు పొందినవారిని గు ర్తించి వారిపై శాఖపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని రద్దుచేయాలని ఆదివాసీ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు వెడ్మ బొజ్జు డిమాండ్ చేశారు. మ ంగళవారం కుమురంభీం ప్రాంగణంలోని కుమురంభీం విగ్రహం వద్ద నోటికి న ల్లగుడ్డలు ధరించి నిరసన తెలిపారు. లంబాడా గిరిజనులను ఎస్టీ జాబితా ను ండి తొలగించేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. దశల వారీగా ఉద్యమం చేపడుతూ శాంతియుత వాతావరణంలో ఉద్యమాలను ఉదృతం చే స్తామన్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా వలసవచ్చి నకిలీ ఏజెన్సీ ధృవపత్రాలు పొంది ఉద్యోగాలు పొ ందారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ధృవపత్రాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆకాల వర్షంతో రైతుకు ఎనలేని నష్టం
* నష్ట పరిహారం కోసం ఎదురుచూపు....

భీమిని, ఫిబ్రవరి 20: ఆకాల వర్షం అన్నదాతకు అషనిపాతంగా అనుకోని నష్టాన్ని మిగిల్చింది. దీనితో రైతులు పెట్టిన పెట్టుబడి రాక పీకల్లోతు అప్పులల్లో కూడుకుపోయ్యారు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షంతో 50 శాతం మేర వరి పంట దెబ్బ తినగా రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే గత వారం రోజుల క్రితం కురిసిన వడగండ్ల వర్షానికి పత్తి, కంది, పెసర, శెనక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనితో రైతు పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. 80 శాతం రైతులు తమ అప్పులు తీరుతాయనే తలంపుతో పత్తి పంటను లక్షల రూపాయాలు వెచ్చించి సాగు బడి చేస్తే నమ్మిన పంట ఆకాల వర్షంతో దెబ్బ తినడంతో రైతులు పెట్టిన పెట్టుబడి వెల్లక అందోళన చెందుతున్నారు. భీమిని మండలంలోని భీమిని, వడాల, పెద్దపేట, మామిడిగూడ, దుబ్బగూడ, మల్లిడి, తదితర గ్రామాలలో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో తీవ్ర మనస్థాపానికి గురై అందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు దుబ్బగూడెం గ్రామంలో సాగు చేసిన పత్తి, కంది, శెనగ పంటలను పరిశీలించి నివేధికను రూపోందించి అధికారులకు అందించినట్లు సమాచారం. మిగితా గ్రామాలలో కూడా సర్వే చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా కూరగాయల పంటలు మొక్కజొన్న, వం కాయ, టమాట, బెండకాయ, ఉల్లిగడ్డ తదితర పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు వీటిపై కూడా సర్వే చేసి రైతులను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు.