అదిలాబాద్

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 20: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానికంగాగల మంత్రి నివాసంలో సిఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 7 లక్షల 1500 రూపాయల విలువగల చెక్కులను 19 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. పట్టణంలోని చింతకుంటవాడకు చెందిన ఎం.రాధకు రూ. 55 వేలు, కురాన్నపేట్‌కు చెందిన వి.మహేందర్‌కు రూ. 30 వేలు, మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆమేఫాబేగంకు రూ.60 వేలు, గాంధీనగర్‌కు చెందిన సాహెనాజ్‌బేగంకు రూ.55 వేలు, చింతకుంటవాడకు చెందిన ఎం.రాజన్నకు రూ.45 వేలు, ఎల్.నర్సయ్యకు రూ.15 వేలు, కాల్వగడ్డకు చెందిన జె.నారాయణకు రూ.60 వేలు, కస్భా ప్రాంతానికి చెందిన కె.హరితకు రూ.21 వే లు, లక్ష్మణచాంద మండలం పీచరకు చెందిన పి.లక్ష్మికి రూ.57,500ల చెక్కుల ను మంత్రి అందజేశారు.

టిఎస్‌జిఎల్‌ఐ బీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాల, ఫిబ్రవరి 20: ప్రభు త్వ ఉద్యోగులు టిఎస్‌జిఎల్‌ఐ భీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ప్రియా ంక అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్‌సిఏ భవన్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వీయ అనుభవం ప్రకారం టిఎస్‌జి ఎల్‌ఐ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక లాభాలు అందుతాయని తెలిపారు. ఉద్యోగుల వేతనాల నుంచి మూల వేతనంకు లోబడి ప్రీమియం తగ్గింపు చేయాలని ఉద్యోగుల ప్రి మియం జమలు సరైన ఖాతాకు వెళ్లుటకు జీతం బిల్లుల యందు పాలసీ నెంబర్‌ను నమోదు చేయాలని తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లా ఇంచార్జ్ భీమా సంయుక్త సంచాలకులు ఎల్‌ఎల్ మార్గరేట్ మాట్లాడు తూ ఉద్యోగుల ప్రిమియంలు సరైన ఖాతాలోకి వెళ్లాలంటే జిల్లాలోని డ్రా ప్టిన్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి ప్రి మియంకు సరిపడ పాలసీని తీసుకోవాలన్నారు. జిల్లా భీమా సహాయ సం చాలకులు ఆదిలాబాద్ జయచంద్ర మాట్లాడుతూ టిఎస్‌జి ఎల్‌ఐ పథకం ప్రయోజనాలను పవర్‌పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా వివరించారు. 21 సంవత్సరం నుంచి 53 సంవత్సరం గల ఉద్యోగులు శాఖ జారీచేసిన భీ మా పాలసీని పోందవచ్చన్నారు. ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ తరువాత వచ్చే క్లైమ్ మొత్తం సోమ్ముకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందన్నారు.