అదిలాబాద్

ఆలయాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, ఫిబ్రవరి 20: తెలంగాణలోని పురాతన దేవాయాలను అన్ని హంగులతో అభివృద్దిపర్చేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సుముఖంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మ ండలంలోని బరంపూర్ గ్రామశివారులోని కొండపైగల శ్రీవెంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శా లువ, మెమోంటోలతో సత్కరించారు. ఈసంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఐకెరెడ్డి మాట్లాడు తూ గత పాలకులు ఆలయాలభివృద్దికి వచ్చే నిధులను సీమాంధ్రకు తరలించి అక్కడి ఆలయాలను అభివృద్దిపర్చుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలోని పురాతన ఆలయాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలోని ఆలయాలన్నింటికీ పూర్వవైభవం తీసుకవచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయి ంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారన్నారు. బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి రూ.50 లక్షలు మంజూరి చేయడం జరుగుతుందని, ఆదివాసీ ఆరాధ్యదైవమైన కెస్లాపూర్‌లోని నాగోబా ఆలయానికి ఇదివరకే రూ. కోటి 50లక్షలు మం జూరు చేయడం జరిగిందన్నారు. దే వాలయాల్లో పూజలు నిర్వహించే అ ర్చకులకు దూపదీప నైవేద్యం కింద ప్రతినెల రూ.6 వేలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపి గెడం నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి, డిసిసిబి చైర్మెన్ ముడుపు దామోదర్‌రెడ్డి, సర్పంచ్ లస్మన్న, మండల రైతు కమిటీ చైర్మెన్ కేదరీశ్వర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ముడుపు భూమారెడ్డి, మల్లయ్య, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.