అదిలాబాద్

ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధిలాబాద్ టౌన్,మార్చి 21: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరుబాటకు సిద్దం కావాలని సిపిఐ రాష్టక్రార్యదర్శి వర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో సిపిఐ 29వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రం సాధించుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయనుకున్న యువతకు కెసిఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రభుత్వం నాలుగేళ్ళకాలంలో పదివేల ఉద్యోగాలు కూడా భర్తిచేయలేదన్నారు. దీంతో నిరుద్యోగ యువతీ యువకులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నిరుద్యోగ సమస్యను పెంచిపోషిస్తుందని విమర్శించారు. కార్మికులు హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర నాయకుడు మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతన్మోదాన్ని పెంచిపోషిస్తూ కార్పోరేట్ రంగ సంస్థలకు వత్తాసు పలుకుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దొరల పాలన సాగిస్తుందని, ఇందుకు ప్రజలంత సంఘటిత ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. పేద వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నా కార్యాచరణలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, మూత పడ్డ సిమెంట్ పరిశ్రమతో పాటు స్పిన్నింగ్‌మిల్లు, పేపర్‌మిల్లులను పునరుద్దరించి కార్మికులకు ఉపాధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్.విలాస్, ముడుపు నళిని రెడ్డి, గోవర్ధన్, మెస్రం భాస్కర్, సిర్ర దేవెందర్, అరుణ్ కుమార్, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌పియంకు రాయితీల జీఓ జారీ
పునరుద్ధరణకు ముందడుగు
కాగజ్‌నగర్,మార్చి 21: కాగజ్‌నగర్ పట్టణంలో మూడున్నర సంవత్సరాల క్రితం మూత పడ్డా సిర్పూర్ పేపర్ మిల్లు ( ఎస్‌పి ఎం) పునరుద్దరణకు ముందడుగు పడింది. బుధవారం ప్రభుత్వం బిల్లు పునరుద్దరణకు కావాల్సిన రాయితీలను ప్రకటిస్తే జీ ఓ ఎన్ ఎస్ నెంబర్ 18 ను జారీ చేసింది. ఈ జీ ఓ ప్రకారం పదేళ్ల వరకు ముడి సరుకు, బొగ్గు, తదితర వాటిపై అవసరాలను బట్టి రాయితీలను ప్రభుత్వం ఇవ్వనుంది. మిల్లులో ఉత్పత్తి అయ్యే పేపర్‌ను సైతం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు జీ ఓ లో పేర్కొంది. మిల్లుకు కావాల్సిన ముడి సరుకు అయిన కలపను ప్రభుత్వం అటవీ భూములలో పెంచేందుకు అనుమతులు కల్పించింది. ప్రభుత్వ ఫారెస్ట్, బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలుకు సైతం రాయితీలను అంగీకరించారు. మిల్లును స్వాధీనం చేసుకునేందుకు ఒరిస్సాకు చెందిన జీ కే పేపర్ మిల్లు ప్రతినిదులు గత నెలలో మిల్లును సందర్శించి వెళ్లినప్పటి నుంచి మిల్లు పునరుద్దరణపై ఆశలు రేకెత్తాయి. ఈ నెల 2 న కేబినెట్ సబ్ కమిటి హైదరాబాద్‌లో సమావేశం అయి చర్చలు జరిపింది. తిరిగి ఇదే నెల 14 న హైదరాబాద్‌లో పూర్తి స్థాయి క్యాబినెట్ మీటింగ్‌లో మిల్లు పునరుద్దరణకు సంబంధించిన పలు చర్యలు తీసుకోవాలని ఆమోదం తెలిపింది. ఈ మేరకు మిల్లు పునరుద్దరణకు ప్రభుత్వం రాయితీలను కల్పిస్తు నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అన్ని రకాల రాయితీలను కల్పించనున్నట్లు జీ ఓ లో పేర్కొంటూ ప్రభుత్వం వెల్లువరించడంపై కార్మికులలో సంబరాలు నెలకొన్నాయి.