అదిలాబాద్

గోండి ప్రచార మాధ్యమ యాప్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిర్యాణి, మార్చి 23: కేంద్ర గోండి ప్రచార మాద్యమా యాప్‌ను శుక్రవారం ఢి ల్లీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళాభవనంలో అవిష్కరించినట్లు తిర్యాణి మండలానికి చెందిన తోటి బిర్దుగోండు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సహాపతి దస్రు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళా కేంద్రంలో ఈనెల 19 నుంచి 23 వరకు దేశంలోని 7 ఆదివాసీ గోండు ప్రజల మేధావుల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గోండు భాష లిపి, కళా సంస్కృతి, డిక్షనరీ వర్క్‌షాపు ఆధ్వర్యంలో మూడు వేల పదాలను రూపకల్పన చేయడం జరిగిందన్నారు. త్వరలో గోండు భాష నిఘంటువు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే గోండు ప్రచార మాధ్యమ యాప్ ద్వారా గోండు పాటలు సందేశాలు, సలహాలు సూచనలు, సమస్యలను తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రొఫేసర్‌లు, పండితులు, మేధావు లు పాల్గొనగా తిర్యాణి మండలానికి చెందిన అఖిలభారత గోండ్వానా మహా సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిడం అర్జు, కొలం సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి అత్రంభీంరావులు పాల్గొనడం జరిగిందన్నారు.