అదిలాబాద్

వట్టిబోయిన పైరు... ఎండుతున్న పైరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, మార్చి 23: మండల కేంద్రానికి చెందిన వడ్నం సాయి రబీలో జొన్నపంటను సాగుచేశాడు. కొన్ని రోజులుగా బోరు వట్టిబోవడంతో పంటచేతికి రాని పరిస్థితి నెలకొంది. బోరు కొద్దిపాటిగా నీరు పోస్తుండడంతో ఒక మడి తడవడానికి రెండురోజులు పడుతుంది. అదికూడా వారం రోజుల్లోగా ముఖంచాటేసే పరిస్థితి ఉంది. సాగుచేసిన జొన్నపైరుకు సమయానికి సాగునీరందక ఎండుతుంది. ఖరీఫ్‌లో తీవ్రంగా పంటలను నష్టపోయానని రబీ పంటైనా ఆదుకుంటుందని, సాగుచేస్తే శ్రమ పెట్టుబడి నష్టపోవాల్సివస్తుందని రైతు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడికి సాయం సాగుతోనే పంటనష్టపరిహారం గురించి ఆలోచించడం లేదని, రైతులు అప్పుల పాలు కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
29న నేత్ర, అవయవ శరీర దాన అవగాహన సదస్సు
బెల్లంపల్లి, మార్చి 26: ఈనెల 29న బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తాలో జనహిత సేవ కమిటి ప్రథమ వార్షికోత్సవం సందర్బంగా సదాశ్రేయ ఫౌండేషన్ వారి సహకారంతో నేత్ర, అవయవ శరీర దాన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడేపు సతీష్ తెలిపారు. శుక్రవారం బెల్ల ంపల్లిలో ఆయన మాట్లాడుతు ఈనెల 27న మంగళవారం ఉదయం 7 గంటలకు తిలక్ క్రీడామైదానం నుంచి ఏఎంసి క్రీడా మైదానం వరకు జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నేత్ర, అవయవ శరీర దాన అవగాహన సదస్సు టూకే రన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ టూ కే రన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంగీకార పత్రాల స్వీకరణ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9398969860 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.