అదిలాబాద్

సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు,మార్చి24: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి సమావేశ మందిరంలో రెవెన్యూ, వ్యవసాయ, ఆరోగ్య, ఉపాధిహామీ, ఐకెపి, పంచాయతీరాజ్, ఐసిడి ఎస్ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజలదరికి చేరేలా కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకునేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా కిసాన్‌మిత్ర సేవలు సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి సమస్యపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డి ఎం ఆండ్ హెచ్‌వో రాజీవ్ రాజ్ మాట్లాడుతూ నూతన ఆసుపత్రి నిర్మాణానికి రూ.కోటి 30లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. భీంపూర్ ఆసుపత్రి స్థాయిలో తలమడుగు ఆసుపత్రిని తీర్చిదిద్దాలన్నారు. అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందునా అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారని, అందుకొరకు ఒంటిపూట కేంద్రాలు నడిపేలా అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. కజ్జర్ల సర్పంచ్ వెల్మ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్‌లందరూ ముందుకు వస్తున్నప్పటికీ మరుగుదొడ్లు పూర్తిచేసుకున్న లబ్దిదారులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీంతో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేకపోతున్నామని అ న్నారు. మండల ఉపాధ్యక్షులు శార్దస్వామి మాట్లాడుతూ సుంకిడి గ్రామం నుండి తలమడుగు వరకు నిలిచిపోయిన రెండువరుసల రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయించాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందడంలేదని, వెంటనే వైద్యుల భర్తీ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఈవో జితెందర్ రెడ్డి, డి ఆర్‌డివో పిడి రాజేశ్వర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్, ఎంపిడివో సునిత, ఎమ్మార్వో అథికొద్దిన్, ఎంఈవో కౌసల్య, మండల ఉపాధ్యక్షులు శార్దస్వామి, జడ్పీటీసీ జక్కుల గంగమ్మ, ప్రభాకర్, డిసిసిబి చైర్మెన్ ముడుపు దామోదర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కేదరీశ్వర్ రెడ్డి, మనోహర్, సాధన పాల్గొన్నారు.