అదిలాబాద్

క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, మార్చి 24: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకోని శనివారం క్షయ వ్యాధి నివారణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నరేష్ కస్తుర్బా గాంధీ విద్యార్థులతో మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యుడు మాట్లాడుతూ క్షయ ( టిబి) సోకిన వ్యక్తి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోని వైద్యులు సూచించిన విధంగా మందులను వాడుకోవడం వల్ల క్షయ వ్యాధిని నివారించవచ్చని ఈ వ్యాధి సోకినప్పుడు మం దులతో పాటుగా బలవర్థకమైన ఆహారాన్ని పచ్చి కూరగాయలు, ఆకు కూరలు, ఉడికిన కోడిగుడ్డు ఆహారంగా తీసుకుంటే వ్యాధి బారి నుంచి తొందరగా బ యట పడవచ్చని, గ్రామాలలో వ్యాధి లక్షణాలు, దగ్గు, గొంతులో నజ్జు లాంటివి కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన మందులను వాడుకోవడం వల్ల వ్యాధిని నివారించుకోవచ్చన్నారు. కస్తుర్బా గాంధీ ప్రత్యేక అధికారి కల్పన, స్ట్ఫా నర్సు విజయ, హెల్త్ అసిస్టెంట్ ఉమా శంకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్‌లో..
ఆసిఫాబాద్ రూరల్ : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుని జిల్లా కేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిఎంహెచ్‌ఓ సుబ్బారాయుడు, క్షయ వ్యాధి ప్రోగ్రాం అధికారి సీతారం, డాక్టర్ నాగేంద్ర, టిబి సూపరవైజర్ గణేష్, తిరుపతి, గంగాధర్, అడ పిహెచ్‌సి సూపరవైజర్ శ్యాంలాల్, రాజేశ్వరి, రాధిక, ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు వివేకానంద కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుబ్బారాయుడు సిబ్బంది చేత టిబి నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వ్యాప్తంగా 2017 జనవరి 1 నుండి 2018 మార్చి 24 వరకు 793 టిబి కేసులు గుర్తించినట్లు సుబ్బారాయుడు తెలిపారు.
జన్నారంలో ..
జన్నారం: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆశావర్కర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి వలన ఇబ్బందులు ఎదురవుతాయని, సిగరేట్, బీడి, మద్యం సేవించవద్దని, వాటివల్ల ఆనారోగ్య పాలవుతారని, గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. సూపర్‌వైజర్ లక్ష్మణ్, కార్యకర్తలు సుశీల, భాగ్య, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.