అదిలాబాద్

నకిలీ విత్తనాల అడ్డుకట్టకు బహుముఖ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మార్చి 24: అమాయక రైతుల బలహీనతలను ఆసరా చేసుకొని నకిలీ విత్తనాల వ్యాపారం పల్లెల్లో జోరుగా సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అక్రమార్కుల భరతం పట్టేందుకు కఠినంగా వ్యవహరించనుంది. ఇందుకోసం కల్తీవిత్తనాల నిరోదక చట్టానికి మరింత పదునుపెట్టి అక్రమ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని రైల్వే మార్గం ఉన్న ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో ఆంధ్ర, మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్, బెల్లంపల్లి, సిర్పూర్‌టి, కౌటాల, మంచిర్యాల ప్రాంతాల్లో పోలీసులు టాస్క్ఫోర్స్ బృందాలు చేపట్టిన దాడుల్లో భారీ ఎత్తున నకిలీ విత్తనాల నిల్వలు బయటపడగా వీరిలో ప్రధాన సూత్రదారులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నకిలీ విత్తన బ్యాగుల విలువ సుమారు రూ.3కోట్లపైనే ఉంటుందని అంచనా. పట్టుబడిన నిందితులను విచారించగా తీయగా వేసవి కా లంలో ఖరీఫ్‌కు ముందే రైతులకు ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను తయారుచేసి రూ.200 నుండి రూ.500 వరకు ఒక్కో బ్యా గును విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. వీటిని సాగుచేసిన రైతులకు పంటకాత రాకపోవడం, దిగుబడి లేక, పెట్టుబడి చేతికి అందక నష్టపోతూ రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సైతం కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్ ఏ ర్పాటు చేసి రైతుల్లో అవగాహణ పెంచెందుకు గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. నకిలీ విత్తనాల గురించి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్టస్థ్రాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయగా మండలం, డివిజన్ స్థాయిల్లోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల స్థావరాలపై దాడులు చేయాలని నిర్ణయించారు. ముఖ్యం గా టాస్క్‌పోర్స్ బృందంలో వ్యవసాయ శాఖ, పోలీసులు జాయింట్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. విత్తన దుకాణాలు, గోడౌన్లు, నిల్వకేంద్రాలు, సబ్ డీలర్లు, డిస్టిబ్యూటర్ల ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలపై టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈసారి బహుముఖ వ్యూహంతో అక్రమార్కులను పట్టుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో కింగ్ రూపంలో పత్తి విత్తనాల ప్యాకెట్లు బయటపడగా నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 8800 ఎకరాల్లో కింగ్ పత్తివిత్తనాలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాంసి, జైనథ్, ఆదిలాబాద్, బేల, ఇచ్చోడ, తలమడుగు రైతులు భారీ ఎత్తున నష్టపోగా పూత కాత లేక దిగుబడి రాక అప్పుల ఊబీలో చిక్కుకుపోయారు. రైతులు అందోళనకు దిగగా వీటిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించి పరిహారం ఇప్పిస్తామని భరోసా కల్పించారు. అయితే ఇంత వరకు నష్టపరిహారం అందలేదు. ఈసారి మాత్రం నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ఏడేళ్ళపాటు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటుంది. పీడియాక్ట్‌ను ఉపయోగించి వ్యాపారులను అరెస్ట్ చేయాలని విజిలెన్స్ బృందాలు వ్యూహం పన్నుతున్నాయి. ఈచట్టం ప్రకారం కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై ఏడాది జైలు శిక్ష, జరిమాన విధించనున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్త బృందాలు వేసవిలో ఖరీఫ్‌కు ముందే దాడులు ముమ్మరంచేస్తే మరిన్ని నిల్వలు బయటపడే అవకాశం ఉంది.