క్రైమ్/లీగల్

ప్రేమ విఫలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసారూరల్,మార్చి24: వటోలి గ్రామానికి చెందిన కొమ్ముల మురళీ (25) యువకుడి ప్రేమ విఫలం చెంది శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్ముల మురళీ కుంటాల మండలం కల్లూర్ గ్రామంలోని ఓ ఫ్రైవేటు దుకాణం నిర్వహిస్తున్నాడు. గతేడాది సారంగాపూర్ మండలం జవుల గ్రామానికి చెందిన సవిత అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయి.
సవితను పెళ్లిచేసుకునేందుకు మురళీ కుటుంబీకులు ఒప్పుకున్నారు. కాగా సవిత కుటుంబీకులు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు సవిత తన సొంత గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రియుడు మురళీ వటోలిలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మురళీ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మురళీ ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి భోజన్న ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అక్రమ్‌ఖాన్ తెలిపారు.