అదిలాబాద్

గూడెంలో పనిచేయని మంచినీటి పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, ఏప్రిల్ 15: మండలంలోని గూడెం గ్రామంలో మంచినీటి పథకం పనిచేయక గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో 2008లో నిర్మించిన మంచినీటి బావి నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఆ గ్రామంలో మంచినీటి బావికి విద్యుత్ సౌకర్యం, పైపులైన్‌లు పగిలిపోవడంతో మంచినీటి పథకం పనిచేయడం లేదని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో మంచినీటి పథకం పనిచేయక తాగే నీటి కోసం కిలోమీటరు దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మంచినీటి పథకాలు, అధికారుల నిర్లక్ష్యం, నాయకుల అశ్రద్దతో మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారి ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న మరమ్మత్తులు సైతం సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు చేపట్టడం లేదని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు, పంచాయతీ అధికారులకు విన్నవించినా తమ గోడు పట్టించుకోవడంలేదని తెలిపారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి గూడెం గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.