క్రైమ్/లీగల్

‘బోథ్’ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 6: బోథ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిదత్త జిన్నింగ్ ఫ్యాక్టరీలో గత నెల 29న భారీ ఎత్తున చోరీ జరగగా కేసును వారం రోజుల్లోనే సిసిఎస్ పోలీసులు ఛేదించి నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆదిలాబాద్ డిఎస్పీ కె.నర్సింహారెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీ సంఘటన వివరాలను వెల్లడించారు. బోథ్‌లోని సాయిదత్త జిన్నింగ్ ఫ్యాక్టరీలో మార్చి 29 అర్ధరాత్రి రాథోడ్ సురేష్ అనే ఇంటర్ విద్యార్థి దొంగతనం చేసి సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చన్న ఆశతో పతకం ప్రకారం జిన్నింగ్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.5లక్షల నగదును దొంగలించాడు. మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు డి ఎస్పీ నర్సింహారెడ్డి అధ్వర్యంలో కేసు దర్యాప్తు ప్రారంభించగా ఆదిలాబాద్ సిసిఎస్ పోలీసులు సయ్యద్ జాకిర్ అలీ, ఆడె మంగల్‌సింగ్‌ల అధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జన్నింగ్ పరిశ్రమలు, సిసిటివి పుటేజీలను పరిశీలించగా బోథ్ మండలానికి చెందిన రాథోడ్ సురేష్ ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడని తెలుసుకొని బస్టాండ్ వద్ద కాపుకాసి నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్నారు. సిసిఎస్ సిఐ సురేష్ అధ్వర్యంలో నిందితున్ని అరెస్ట్ చేయగా రూ.4.37లక్షలు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. డి ఎస్పీ మాట్లాడుతూ గతంలో నిందితుడు సురేష్ ఒక చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. నిందితున్ని త్వరలో న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జిన్నింగ్ ఫాక్టరీ, ఇతర పరిశ్రమల యజమానులు సిసి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాగా వారం రోజుల్లోనే చోరీ కేసును ఛేదించిన సిసి ఎస్ కానిస్టేబుళ్ళకు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ రివార్డులు ప్రకటించినట్లు డిఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో సిసి ఎస్ పోలీసులు చురుకుగా పనిచేస్తున్నారని, రాత్రి సమయంలో గస్తీతో పాటు అనుమానస్తులపై నిఘా పెంచినట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో సిసిఎస్ సిఐ సురేష్, కానిస్టేబుళ్ళు సయ్యద్ జాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.