అదిలాబాద్

కుప్టి ప్రాజెక్టు జీవోను సవరించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, ఏప్రిల్ 16: బోథ్ నియోజకవర్గంలోని కుప్టి గ్రామ సమీపంలో గల కడెం వాగుపై నిర్మించతలపెట్టిన కుప్టి ప్రాజెక్టు జీవో 18ని వెంటనే సరవించాలని, లేని పక్షంలో జా తీయ రహదారిని దిగ్భ్రందిస్తామని మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి. రాంచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు. సోమవారం మండల కేంద్రంలోని అం బేద్కర్ చౌరస్తాలో అఖిలపక్షం అధ్వర్యంలో జరిగిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో ఆ యన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 18 ప్రకారం బోథ్ నియోజకవర్గ రైతులకు కుప్టి ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు కూడా రాదని, కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి నిల్వ నీటిని కడెం ప్రాజెక్టు కిం ద ఉన్న ఆయకట్టు రైతులకు రెండో పంటకు గాను నీరివ్వడానికి నిర్మిస్తున్నట్లు జీవోలో స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఇదే జరిగితే బోథ్ నియోజకవర్గ రైతులకు సాగునీరు ఎప్పటికీ రాదని, దీనిపై ఉద్యమాలను ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కుప్టి వద్ద జాతీయ రహదారి దిగ్బ్రందన కార్యక్రమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి తిర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించి నిరసనలు తెలియజేయాలన్నారు. కుప్టి ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న భూనిర్వాసితులకు 2013 జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐసిసి సభ్యుడు న రేష్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని, బోథ్ ప్రా ంత రైతులకు సాగునీరు అందకుండా కుప్టి ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారపక్ష శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇలాంటి నాయకులకు గ్రామాల్లో ఎక్కడికక్కడా నిలదీయాలని పిలుపునిచ్చారు
కుప్టి వద్ద కడెం వాగుపై 12.5 టిఎంసిల నీటి లభ్యత ఉన్న దానిని కుదించి కేవలం 5.35 టి ఎంసీలకు పరిమితం చేశారని, దీంతో నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇ ందులో నుండి 3.32 టి ఎంసీల నీరు కడెంకు వదిలిపెడితే ఇక్కడి రైతులకు ఎక్కడి నుండి సాగునీరు ఇస్తారని ప్రశ్నించారు. కుప్టి ప్రాజెక్టు డిజైన్ మార్చి ప్రాజెక్టు ఎత్తును పెంచుకోవాలని, దీనివల్ల 12 టిఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని సూచించారు. నియోజకవర్గంలోని అత్యంత ప్రధానమైన ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే రానున్న తరాలు క్షమించవని స్పష్టం చేశారు.
రైతు స్వరాజ్యవేదిక అధ్యక్షులు బొర్రన్న మాట్లాడుతూ కడెం ప్రాంత రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎస్ ఆర్ ఎస్‌పి ద్వారా నీటిని సరఫరా చేసి కడెం ప్రాజెక్టు ఎత్తును పెంచుకోవాలని, ఇక్కడి నీ టిని తరలించుకుపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవో 18ని సవరించాలని, లేనిపక్షంలో అందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు దారట్ల కిష్టు, మాజీ మున్సిపల్ చైర్మెన్ దిగంబర్‌రావు, కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ నాయకులు కుమురం కోటేష్, మల్లెపూల నర్సయ్య, మైమూద్‌ఖాన్, సరుూద్‌ఖాన్, మాజీ మా ర్కెట్ చైర్మెన్ నర్సింగ్‌రావు, ఆహ్మాద్‌ఖాన్, సి పిఎం రాష్ట్ర నాయకులు బండి దత్తాత్రి, బిజెపి జిల్లా నాయకులు మానాజీ, కదం బాబురావు, భీంరెడ్డి, సూర్యకాంత్‌గిత్తె పాల్గొన్నారు.