అదిలాబాద్

సత్తా చాటిన సంక్షేమ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఏప్రిల్ 17 : ఈ నెల 14వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు మెదక్‌లో జరిగిన రాష్ట్ర 3వ సబ్‌జూనియర్ అండర్ 12 అంతరాష్ట్ర సాఫ్ట్ బాల్ ఛాంఫియన్ షిప్ 2018 పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా జట్టులో బెల్లంపల్లి తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారని గురుకుల ప్రిన్సిపల్ ఐనాల సైదులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో ట్రాంజ్ మెడల్ సాధించిన ఏడో తరగతికి చెందిన ఎం సాయి తేజ , డి సుశీల్, జీ మనోహార్, నితిన్, ఆరవ తరగతికి చెందిన కే విజయ్‌ల ను మంగళవారం సంక్షేమ గురుకులాల రీజినల్ కో ఆర్డీనేటర్ వెంకటలక్ష్మి, అసిస్టెంట్ అర్ సి ఓ డేవీడ్ చంద్రశేఖర్, పాఠశాల ప్రిన్సిపల్ ఐనాల సైదులు ప్రత్యేకంగా అభినందించారు.
అంతేకాకుండా అండర్ 10 విభాగంలో ఆరవ తరగతికి చెందిన కేనితిన్, ఈ ప్రేమ కుమార్, శ్రీ కాంత్, డి సుభాన్‌లు ఆడినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన కోట యాదగిరిని ప్రత్యేకంగా అభినందించారు.

ఆసిఫా నిందితులను ఉరి తీయాలి
నార్నూర్, ఏఫ్రిల్ 17: జమ్ము కాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆసిఫా మరణానికి కారకులైన నిందితులను బహిరంగంగా ఉరితీయ్యాలని ఎస్సీ ఎస్టీ మై నార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా ఆయా సంఘాల నాయకులు సయ్యద్ ఖాసీం, సురేష్ ఆడె, బాబాఖాన్, అమిత్‌నాయక్‌లు మా ట్లాడుతూ అభం శుభం తెలియని చి న్నారి బాలికపై అత్యాచార ఆఘాయిత్యానికి పాల్పడి హత్యేసిన మానవ మృగాలను వెంటనే ఉరితీయ్యాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అత్యాచార ఘటనలు పునరావృతం అవుతున్నాయని అ న్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దోషులను ఉరిశీక్ష విధించి, ఇక ము ందు ఇలాంటి దుశ్చర్యలకు ఎవరు సహాశించకుండా కఠిన చట్టాలు అ మలుపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సికిందర్, యుసూఫ్‌కాన్, ఇంతియాజ్, చిన్న, మోహన్, చోటు, రాజ్‌పంగే, గణేష్, అనిల్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.