అదిలాబాద్

ఆసిఫాబాద్‌లో వడగళ్ల వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఏప్రిల్ 17: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. అరగంట పాటు వడగళ్లతో భారీ వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులతో మొదలైన వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. భారీ వర్షంతో రహాదారులు జయమయంగా మారాయి. దష్నపూర్, జెండాగూడ గ్రామంలో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రాత్రి 8గంటలు అయిన విద్యుత్ రాకపోవడంతో జిల్లా కేంద్రంలో పాటు పలు గ్రామాల్లో అంధకారం అలుముకుం ది. వర్షం వలన పలు పంటలు దెబ్బతిన్నాయి.

పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ
తాండూర్, ఏప్రిల్ 17: బీపీ ఏ ఓసీపీ-2 ఎక్స్‌టెన్సన్ గని పరిసరంలోని సోనాపూర్ రైతులకు మంగళవారం ప్రాజెక్టు అధికారి చింతల శ్రీనివాస్ పంట నష్టపరిహారం చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా గోలేటీ ఏజెంట్ కార్యాలయంలో చెక్కులు పంపిణి చేశారు. పీవో మాట్లాడుతూ కుమురం దొందేరావుకు రూ.5500, సముద్రాభాయికి రూ. 15000 ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ చొరవతో రైతులకు ప ంట నష్టపరిహారం మం జూరు అయ్యిందన్నా రు. భూనిర్వాసితులకు సింగరేణి అండగా ఉంటుందన్నారు.

టీజేఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 17: 29న హైదరాబాద్‌లో నిర్వహించే తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టిజెఎస్, టిజెఏసి జిల్లా కోచైర్మెన్ సామల ప్రశాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో టిజెఎస్, టిజెఏసి నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా సామల ప్రశాంత్ మాట్లాడుతూ టిజె ఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగే పార్టీ ఆవిర్భావ సభకు జిల్లా నుండి అధిక సం ఖ్యలో మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సం ఘాలు, ప్రజలు, నిరుద్యోగులు పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. నేడు తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని, దీంతో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నీరు, నిధులు, నియామకాల కోసం పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఏలాంటి అభివృద్ది జరగడం లేదని, రాష్ట్రం అప్పుల పాలు కావడంతో పాటు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వారిని అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఒంటెత్తుపోకడలతో పాలన సాగిస్తున్న టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి బుద్దిచెప్పేందుకే ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం టిజెఎస్‌ను స్థాపించడం జరిగిందని, ప్రజలు అండగా ఉండాలన్నారు. రాజారెడ్డి, సుభాష్, నాయక్, సంజయ్ రెడ్డి, హన్మంత్, అనిల్, శ్రీనివాస్, ప్రభాకర్, జీవన్, విశ్వనాథ్, కృష్ణ, టిజెఎస్ మహిళా నాయకులు సౌజన్య, వంశీప్రియ పాల్గొన్నారు.