అదిలాబాద్

రైతుబంధు పథకం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబందు పథకం దిగ్విజయంగా విజయవంతమైందని రాష్ట్ర రైతుబందు పథక పరిశీలకులు, ఉద్యానవనశాఖ సంచాలకులు వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 422 గ్రామాల్లో లక్ష 64 వేల చెక్కులకుగాను లక్ష 10 వేల చెక్కులను పంపిణీ చేయడం పూర్తయిందన్నారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయ పెట్టుబడి సహాయంగా ఎకరానికి రూ.8 వేలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఈ పెట్టుబడిని ఉపయోగించి మేలు రకమైన పంటలు సాగుచేసి లబ్ధిపొందాలన్నారు. పంట దిగుబడులు పెంచడం ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో సాగుకు పసుపు, ఆయిల్ ఫామ్, మల్భరీ పంటలు అనుకూలంగా ఉన్నాయని, వీటిని సాగుచేసి అధిక దిగుబడులు రైతులు సాధించాలన్నారు. రైతులను చైతన్యంచేసి ఆధునిక వ్యవసాయ పద్దతులు తెలియజేస్తామన్నారు. ఫ్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని, పురుగులమందుల వాడకాన్ని తగ్గించాలని రైతులను కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ రైతుబందు చెక్కుల పంపిణీ కేంద్రాల వద్ద ముందస్తుగా అన్నిరకాల ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతీ 300 మంది రైతులకు కౌంటర్‌ను ఏర్పాటుచేయడంతో సజావుగా ముగిసిందన్నారు.
నిర్మల్ జిల్లాలో జీవనోపాధికోసం ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందని, వీరి పేరున ఉన్న రైతుబందు చెక్కులను పంపిణీ చేయడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యానవనశాఖ జిల్లా అధికారి నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అమరేష్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం మెరుగునకే
ఆటో రిక్షాల పంపిణీ
* మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర
మంచిర్యాల, మే 17: మంచిర్యా ల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలోని పారిశుధ్యం మెరుగు కోసం తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందకు ఓనర్ కం డ్రైవర్ ఆటో రిక్షాలను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర అన్నారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయ అవరణంలో ఆటో రిక్షాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ఓనర్ కం డ్రైవర్ స్కీంలో తడి,పోడి చెత్తను వేర్వేరుగా సేకరించేందకు ప్రవేటు వ్యక్తులకు బాధ్యతలను అప్పగించారని తెలిపారు. సదరు వ్యక్తులు మున్సిపల్ అధికారుల సూచనల మేరకు ఎంపిక చేసిన స్థలాలో చెత్తను సేకరించాల్సి ఉంటుందని అన్నారు. మున్సిపాలిటి పరిధిలో స్కీం కింద ఆరుగురు దరఖాస్తులు చేసుకోగా బ్యాంక్ సహకారంతో టాటా ఏసీ ట్రాలీ వాహనాలను 80 నుంచి 90శాతం వరకు సబ్సిడీ వాహనాలు మంజూరు చేయనున్నట్లుగా చైర్ పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్, కమీషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్‌లు జగన్మోహాన్ రావు, కారుకూరి చంద్రవౌలి, పడాల రామన్న, పూదరి ప్రభాకర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులుగాదే సత్యం, తదితరులు పాల్గొన్నారు.