అదిలాబాద్

టీఆర్‌ఎస్ హయాంలోనే దళితులకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, మే18: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులు, గిరిజనులకు పూర్తి న్యాయం చేకూరుతుందని ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే కోనేరు కోణప్ప, అడిషనల్ ఎస్పీ గోద్రు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరగలేదన్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతన్నాయా? లేదా అనేదే కమిటి ఉద్దేశమన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వీరికి చేరవేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గిరిజన మహిళలపై అత్యాచారాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులు 43 నమోదు కాగా, 32 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. మరో 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అడిషనల్ ఎస్పీ గోద్రు ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మెన్‌కు వివరించారు. కాగా పెండిగ్ కేసులను వీలైంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
దళిత, గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీరి భూములు ఆక్రమణకు గురికాకుండా చూసినప్పుడే దళితులు, గిరిజనులకు న్యాయం చేసిన వారమవుతామన్నారు. అటవీ అధికారులు ఎస్సీ, ఎస్టీల భూములను తిరిగి తీసుకునే యత్నం చేస్తున్నారని, అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రోళ్ల సూచించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ వెనక బడ్డ కుమరం భీం జిల్లాలో అధికంగా దళితులు, గిరిజనులున్నారని, వీరి హక్కులు, చట్టాల పరిరక్షణలో చిత్తశుధ్దితో పని చేయాలని కోరారు. అప్పుడే జిల్లా అనుకున్న రీతితో ముందుకు వెలుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని సూచించారు. దళితులు, గిరిజనులు విద్యలో వెనుకబడి ఉన్నారని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, భవిష్యత్‌లో జబ్బులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనతతో బాధపడకుండా పౌష్టికాహారం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డీఎస్పీ సత్యనారాయణ, కమిటి సభ్యులు దేవయ్య, నరసింహ, రాంబాల్ నాయక్, విద్యాసాగర్, నీలాదేవి, కమిటి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎస్టీ హోదాను సాధించుకుందాం
* మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే
ఆదిలాబాద్ టౌన్, మే 18: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్టీ హోదా సాధించుకుందామని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమా ర్ పెట్కులే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు ఇవ్వనున్న పదిశాతం రిజర్వేషన్‌లో మాలీకులస్తులను కలిపి పెంచుతున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం ఇంత వరకు చెల్లప్ప కమిషన్‌తో మాలీల సర్వే పూర్తిచేయించలేదని, సర్వే పూర్తిచేసిన వెంటనే కేంద్రాన్ని ఒప్పించి ఎస్టీ హోదా కల్పించాలని డిమాం డ్ చేశారు. అలా జరగని పక్షంలో 2019 సాధారణ ఎన్నికలను బహిష్కరించి మాలీ కులస్తులు ప్రభుత్వానికి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. దీనికోసం మాలీలను ఐక్యం చేస్తామని అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎల్లారం, వాంకిడి, కోమటిగూడ, తేజపూర్ గ్రామాల్లో మాలీ గ్రామ సభలు ఏ ర్పాటు చేసి, ఎస్టీ హోదా కల్పించాలంటూ తీర్మానాలు చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు విజయ్ వాడ్గురే, గంగారాం శిండె, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాగోజీ, నగేష్ పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
* కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఆసిఫాబాద్, మే 18: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించే విధంగా ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ఎన్నికల నిర్వహణ విషయమై జిల్లాలోని ఎంపిడి ఓలతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు అందించారు. ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్ల గణన వార్డుల వారీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్ల వివరాలు మండలాల వారీగా సమర్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నిలకు అవసరమైన సిబ్బంది వివరాల జాబితాను రూపొందించాలన్నారు. డీపీవో గంగాధర్‌గౌడ్, ఆయామండలాల ఎంపిడిఓలు పాల్గొన్నారు.