అదిలాబాద్

అటవీ హక్కుదారులకూ ‘రైతుబంధు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు,మే 18: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని పల్లిబిలో నిర్వహించిన రైతుబంధు కార్యక్రమానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు కొత్త పట్టాపాసుబుక్‌లతో పాటు చెక్కులను అందజేశారు. జేసీ మాట్లాడుతూ రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న ఎకరానికి రూ.నాలుగు వేలతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవాలన్నారు. లైసెన్స్‌లు కలిగిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేసుకొని రషీదులు పొందాలన్నారు. దళారుల బారిన పడకుండా తమ సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆదివాసీ గిరిజనులు గత కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్న అటవీ ఉత్పత్తులకు పట్టాపాసు బుక్‌లతో పాటు చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ అథికొద్దిన్, ఎంపీపీ సిడాం రాము, మండల రైతు సమన్వయ సమితి చైర్మన్ ముడుపు కేదరీశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఆశమ్మ, వ్యవసాయ అధికారి అరుణ, ఎంఆర్‌ఐ లచ్చిరాం, తదితరులు పాల్గొన్నారు.

సేవాలాల్ మహరాజ్ విగ్రహం ధ్వంసం
* బాబాపూర్‌లో భారీ బందోబస్తు
ఆసిఫాబాద్, మే 18: కుమరం భీం జిల్లా బాబాపూర్‌లో లంబాడా ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ రామారావు మహరాజ్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. శుక్రవారం తెల్లవారు జామున విగ్రహం చేయి విరిగి కనిపించడంతో ఆగ్రహం చెందిన సదరు సదరు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. జిల్లాలో గోండు, లంబాడాల మధ్య చెలరేగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో సేవాలాల్ మహరాజ్ విగ్రహం ధ్వంసం కావడాన్ని పోలీసులు ఒకింత సీరియస్‌గా తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ గోద్రు, డిఎస్పీ సత్యనారాయణ, పోలీసు సిబ్బందితో హుటాహుటిన బాబాపూర్ చేరుకొని గ్రామస్థులతో చర్చించారు. దుండగులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ విగ్రహం చేయి ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని కోరుతూ ఎంపిపి తారాబాయి, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భానోత్ శివ, ఇందూలాల్, బలరాం, మత్రులాల్, శంకర్, గోపాల్ నాయక్, రాము డిమాండ్ చేశారు. లంబాడాలకు న్యాయం చేసే వరకు శాంతియుత పోరాటం సాగిస్తామన్నారు. ప్రభుత్వమే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

బీజేపీని ఆహ్వానించడం అప్రజాస్వామ్యం
* మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి
ఆదిలాబాద్ టౌన్,మే 18: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమిని కాదని గవర్నర్ బీజేపీని అధికారం చేపట్టాలని ఏకపక్షంగా ఆహ్వానించడం అప్రజాస్వామికమని, గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో ఆందోళనకు దిగారు. శుక్రవారం మాజీమంత్రి రాం చంద్రారెడ్డి, ఏఐసిసి సభ్యుడు నరేష్ జాదవ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ దొంగల రాజ్యం అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు యడ్యూరప్ప, గవర్నర్ వాజుభాయ్‌వాలా దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్‌రావు పాటిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్లు యాసం నర్సింగ్, సంజీవ్ రెడ్డి, కుమురం కోటేష్, కౌన్సిలర్లు అంబకంటి సుష్మ అశోక్ పాల్గొన్నారు.