అదిలాబాద్

భూ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, మే 22: కనె్నపల్లి మండలంలోని పలుగ్రామాల రైతుల భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని, కాసులు ఇవ్వనిదే పనులు చేయడం లేదని గ్రామస్థాయిలో వీఆర్‌ఓ లకు లంఛం ముట్టచెబుతేనే ఫైల్ కదులుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారని, ఎంసిపిఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆయా గ్రామాల రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తహసీల్దార్‌కు పలు భూ సమస్యలతో కూడిన వినతి పత్రంను అందించారు. మండలంలోని జజ్జెరవెల్లి, కొత్తపల్లి, రెబ్బెన, ముత్తాపూర్, వీరాపూర్, వీగామా, వెంకటపూర్, దుబ్బగూడెం గ్రామాలలో రైతులకు ఇప్పటి వరకు పట్టా దారు పాస్ పుస్తకాలు చెక్కులు అందలేదని రైతుల గోడును విన్నకుండా రెవెన్యూ అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రైతుల భూ సమస్యల పరిష్కారంలో అదికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, గత 30, 40 సంవత్సరాల నుంచి కాస్తులో ఉన్న రైతుల పేరున భూములను ఇప్పటికి ఆన్‌లైన్‌లో పొందు పరుచలేదని ఇదిలా ఉండగా రైతులు చేసుకున్న దరఖాస్తులను పక్కన బెట్టి వీరు కా స్తు చేసుకుంటున్న భూములను కాసులకు ఆశ పడి ఇతరుల పేరున పట్టాలు చేయడం దారుణమని ఈ విషయాలపై రైతులు నిలదీస్తే రైతులకు కల్లిబొల్లి మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు తీరు మార్చుకోని పేద, దళిత, గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనె్నపల్లి కార్యదర్శి రాజలింగు మాట్లాడుతూ రైతులను అధికారులు భూ సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులకు గురి చేస్తూ కార్యాలయాల చుట్టు తిప్పుకుంటున్నారని ఎన్నో ఏళ్లుగా కాస్తులో ఉన్న రైతులను కాదని, ఇతరుల పేరున భూములను పట్టాలు చేయడం అధికారుల తీరుకు నిదర్శనం అని ఇప్పటికైనా అధికారులు రైతులు సాగు చేసుకుంటున్న భూముల వద్దకు వెళ్లి పరిశీలన చేసి సాగు రైతులకు పట్టాలు అందించాలని లేని పక్షంలో ఎంసిపిఐయూ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ శ్రీనివాస్, ఏఐఎఫ్‌డీవై జిల్లా కార్యదర్శి పసుపులేటి వెంకటేష్, నాయకులు నాగరాజు, రైతులు మల్లేష్, లక్ష్మి, విమల పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం
* ఎమ్మెల్యే బాపురావు
బోథ్ రూరల్, మే22: రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ మండలంలోని కౌఠాబి గ్రామంలో 8 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీ ట్రాక్టర్లను అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఆధునిక వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలని, ప్రభుత్వం సైతం రాయితీలపై వ్యవసాయ పనిముట్లను అం దించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ రైతును ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల రూపకల్పనతో ప్రతి ఎకరానికి సాగునీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని, రైతు బం ధు పథకం రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. గతంలో రైతు లు పంట పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ఉండేదని, కాని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో ఇకపై రైతులే ఇష్టమైన విత్తనాలతో పాటు ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. అదే విధంగా భూప్రక్షాళనతో భూ సమస్యలను శాశ్వతంగా దూరం చేయడం జరిగిందన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్దిసాధిస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా తాము ముందుకు వెళ్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగుల లక్ష్మి, తెరాస మం డల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, నాయకులు గంగుల మల్లేష్, జగన్మోహన్ రెడ్డి, గాజుల సురెందర్, తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్, ఏవో భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.