అదిలాబాద్

మినీ ట్యాంక్ బండ్ పనులు అడ్డగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్సెట్టిపేట, మే 25: మండలంలోని ఇటిక్యాల గ్రామంలో చెరువు వద్ద చేపడుతున్న మినీ ట్యాంక్ బండ్‌పనులు నిలిపివేయాలని చెరువు పరిరక్షణ కమి టీసభ్యులతో పాటు గ్రామస్థులు, రైతులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న పనుల్లో నాణ్యత లేదని వాపోయారు. తూం కోసం వేస్తున్న పైపుల కింద బెడ్ సరిగా వేయడం లేదని రైతులు పనులు అడ్డుకుని పనులను నిలిపివేశారు. అంతే కాకుండా మత్స్యకారులు చెరువు సర్వే చేపడతామని ఇప్పటి వరకు చేపట్టకుండా పనులు చేయడం సరికాదని అధికారులతో వాగ్వాదం చేశారు. మిని ట్యాంక్ బండ్ పనుల నిమిత్తం ఈత చెట్లను కొట్టి చెరువులో పడివేయడంతో చేపలు పట్టుకునే వీలు లేకుండా పోయిందన్నారు. నాసిరకం పనులు చేస్తు తూం నిర్మిస్తే రానున్న రోజుల్లో తూం తెగితే కట్ట కింది రైతులు తీవ్ర నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వచ్చి పనుల పూర్తి వివరణ రైతులకు ఇవ్వనిదే పనులు జరగనివ్వమన్నారు. ఇరిగేషన్ ఏఇ గౌతం, వీఆర్‌ఓ రాజేశ్వర్ వచ్చి రైతులతో మాట్లాడి కాంట్రాక్టర్‌ని పిలిపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చెరువు సర్వే కూడా వెంటనే చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో చెరువు పరిరక్షణ కమిటీ కన్వీనర్ సప్ప రవి, సభ్యులు మేడి నారాయణ, శంకర్, మేడి నర్సయ్య, మంచికర్తి నర్సయ్య, బుద్దె శేఖర్‌తో పాటు రైతులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో టాస్క్ఫోర్సు దాడులు
కాగజ్‌నగర్, మే 25: కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్, గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్సు సీఐ రాంబాబు వివరాల ప్రకారం దుర్గానగర్‌లోని సంజయ్ కిరాణ దుకాణంలో నిల్వ ఉంచిన ఒక క్వింటాల్ 4 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీన పరుచుకున్నామని దీని విలువ రూ.15600 ఉంటుందని, రూ.2000 విలువ చేసే గుట్కాలు, అంబార్ ప్యాకేట్లను సైతం స్వాధీనం చేసుకున్నామని సి ఐ తెలిపారు. 0.8 మైక్రాన్స్ కన్న ఎక్కువ ఉన్న పాలిథిన్ కవర్‌లను ప్రభుత్వం నిషేధించిందని ఎవరైనా ఇలాంటివి అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిషేధిత గుట్కాలు అమ్మడం చట్టరీత్యా నేరం అని సి ఐ పేర్కొన్నారు. వీటిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తదుపరి చర్యల కోసం అప్పగించడం జరిగిందన్నారు. టాస్క్ఫోర్సు సిబ్బంది ప్రసాద్, వెంకటేష్ ఉన్నారు. పట్టుకున్న వస్తువులను కాగజ్‌నగర్ పట్టణ సీఐ వెంకటేశ్వర్లకు అందజేశారు.
అక్రమంగా నిల్వ ఉంచిన పత్తి విత్తనాల పట్టివేత

కౌటాల, మే 25: చింతలమానేపల్లి పోలీస్‌స్టేషన్ గూడెం పరిధిలో అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలను దాడి చేసి పట్టుకోని కేసు నమోదు చేసినట్లు చింతలమానేపల్లి ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బంగిరే నాని ఇంట్లో అక్రమంగా పత్తి విత్తనాలు నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం రోజున ఆకస్మిక తనిఖీలు చేయగా 45 కిలోల పత్తి విత్తనాలు, 3 సంచులలో బయట పడ్డాయని ఈ మేరకు విచారణ చేపట్టగా అదే గ్రామానికి చెందిన కస్తురి మహేష్ రెడ్డి అనే వ్యక్తి నాని ఇంట్లో పత్తి విత్తనాలను తీసుకొచ్చి నిల్వ చేసినట్లు పేర్కొన్నారని ఈ మేరకు నాని, మహేష్ రెడ్డిపై కేసు నమోదు చేసి విత్తనా లు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మండల వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే సహించేది లేదని ఇప్పటికే నకిలీ విత్తనాల అమ్మకాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రైతులు కూడా గ్లైసిల్ పత్తి విత్తనాల జోలికి వెళ్లవద్దని సూచించారు.