అదిలాబాద్

పీహెచ్‌సీలో స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,మే 25: స్థానిక మండలం హస్నాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో శుక్రవారం వైద్య సిబ్బంది స్వచ్చ్భారత్ నిర్వహించారు. జిల్లా సహాయ వైద్యాధికారి డాక్టర్ వసంత్‌రావుతో పాటు ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొని ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. అదే విధంగా చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత్‌రావు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణాల్లో స్వచ్చ్భారత్ నిర్వహించి, పరిశుభ్ర వాతావరణం కల్పించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలంటే వారికి ఆసుపత్రి పరిసరాలను ఆదర్శంగా ఉంచాలన్నారు. వచ్చేది వర్షాకాలమని, పిచ్చిమొక్కలు మొలకెత్తే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు తొలగించినట్లయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్టీ హోదా సాధించే వరకు పోరాటం
* మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెట్కులే
ఆదిలాబాద్ టౌన్,మే 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాలీలకు ఎస్టీ హోదా కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో మాలీల సమస్యలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు జరిపినప్పటికీ సి ఎంను కలువకుండానే వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. దీనికి జిల్లా నేతలు బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తర్వాత నెరవేర్చకపోవడం దారుణమని, తెలంగాణ సెక్రెటరీయేట్ పైరవీలకు అడ్డగా మారిందన్నారు. ఇక్కడి ఉద్యమ కారులకు కాకుండా బడా బాబులకు పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ వస్తే మా కుల సంఘం సమస్యలన్ని తీరుతాయని భావించిన మాలీలకు కెసి ఆర్ నిరాశే మిగిల్చారని అన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చే వరకు పోరాటాలు ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు విజయ్ వడ్గులే, ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లా అధ్యక్షులు శంకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.