అదిలాబాద్

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మే 25: దేశవ్యాప్తంగా చేపడుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రదాన తపాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియూసి రాష్ట్ర నాయకులు విలాస్ పాల్గొని ప్రసంగించారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. ప్రదానమంత్రి మోది కార్పోరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్రకమిటీని నియమించిందని, ఆ కమిటీ ఇచ్చిన పెన్షన్ విధానంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. వెంటనే బేషరత్‌గా తపాల శాఖ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, లేనట్లయితే ట్రేడ్‌యూనియన్ల అధ్వర్యంలో ఉద్యోగుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ యూనిట్ కార్యదర్శి మహేష్ రెడ్డి, సంఘం నాయకులు ఉపేందర్, ప్రకాష్ గౌడ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
బాసరకు పోటెత్తిన భక్తజనం
బాసర, మే 25: బాసర అమ్మవారి క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. చదువులతల్లి సరస్వతిదేవి అమ్మవారిని కొలిచేందుకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారి సర్వ దర్శన క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శన సేవకు 2 గంటల సమయం పట్టడంతో క్యూలైన్‌లో ఉన్న వృద్దులు, చిన్నారులు సొమ్మసిల్లి పడ్డారు. ఆలయ అధికారులు క్యూలైన్‌లో ఉన్న భక్తులకు చిన్నారులకు తాగునీటిని అందజేశారు. వేసవి సెలవులు మరోవారం రోజుల్లో ముగియనున్న సందర్భంగా ఒకేసారి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులతో అమ్మవారి దర్శన క్యూలైన్‌లు సందడిగా మారాయి. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.