అదిలాబాద్

పథకాలను వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 25: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని స్వర్ణప్రాజెక్టు కింద తూములు, కాలువల మరమ్మతుల కోసం రూ.14 కోట్ల 19 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో దాదాపు 35 వేల ఉద్యోగాలను నియమించడం జరిగిందన్నారు. త్వరలోనే 18 వేల పోలీసు ఉద్యోగాలను, 8 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను నియమించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం 27వ ప్యాకేజీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా స్వర్ణ, బోరిగాం ప్రాజెక్టుల నుండి 50 వేల ఎకరాలకు నీరందించబోతున్నామన్నారు. 27వ ప్యాకేజీ కింద ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద ఇప్పటికే డబ్బులు చెల్లించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5.75 లక్షల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశామని, వీటికి సంబంధించిన డబ్బులు 62 కోట్లు మంజూరయ్యాయన్నారు. సోమవారం నుంచి రైతుల ఖాతా ల్లో వీటిని జమచేస్తామని తెలిపారు. స్వర్ణ గ్రామంలోని మసీదు కాంపౌండ్‌వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరీచేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం 80 శాతం సబ్సీడిపై పలు పథకాలను ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. అనంతరం రూ. కోటి నిధులతో ని ర్మించనున్న బోథ్ - అడెల్లి రోడ్డుకు అడెల్లి ఆలయం వద్ద మంత్రి శంకుస్థాపన చేశారు. ఇరిగేషన్ ఎస్‌ఈ భగవంత్‌రావు, పీఎసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వెంటక్‌రాంరెడ్డి, అడెల్లి ఆలయ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజ్ మహ్మద్, ఈఈ రమేష్, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ లక్ష్మీ, ఎంపీటీసీ లక్ష్మ వ్వ పాల్గొన్నారు.