అదిలాబాద్

డీఈవో కార్యాలయం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, మే 26: అక్రమ బదిలీలను నిరసిస్తూ శనివారం ఆదిలాబాద్ డిఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల కార్యచరణ సమితి నాయకులు ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు అతీతంగా బదిలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కాని దానికి భిన్నంగా ప్రస్తుతం ప్రగతి భవన్ కేంద్రంగానే అక్రమ బదిలీలు జరగడం విచారకరమని, ఒకవైపు కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామంటూనే రాజకీయ పలుకుబడితో పట్టణ ప్రాంతాలలోని ఖాళీలను బదిలీలకు ముందుగానే ఎగరేసుకుపోతుంటే సాధారణ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సిలింగ్ వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అక్రమాలను నిరోదించాల్సిన ప్రభుత్వం ఈ రకంగా ప్రోత్సహించడం బాధకరమని, రాష్టవ్య్రాప్తంగా సుమారు వంద బదిలీలు జరిగాయని, ఇంకా భారీ సంఖ్యలో బదిలీలు నిర్వహించడానికి రంగం సిద్దమైందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ అక్రమ దిలీలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. యూఎస్‌పి ఎస్‌సి, జెఏసిటివో నాయకులు వెంకట్, లక్ష్మణ్‌రావు, వృకోధర్, శ్రీనివాస్, నరేందర్, అశోక్, రామేశ్వర్, ఆత్రం సుగుణ, భుజంగ్‌రావు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్: ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం యుఎస్‌పిసి, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా యుఎస్‌పిసి, జాక్టో నాయకులు మాట్లాడుతూ ఒక వైపు ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించగా మరో వైపు సిఎంఓ కార్యాలయం ఆధ్వర్యంలో పారదర్శకతకు పాతర వేస్తూ అక్రమంగా బదిలీలు చేపట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్‌యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆగాచారి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు చరణ్ దాస్, ఎస్టీయు సంఘ జిల్లా అధ్యక్షుడు రవీందర్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకమలాకర్ రెడ్డి, నాయకులు హేమంత్ షిండే, జాడి ప్రభాకర్, సిహెచ్. సంజయ్ కుమార్, పీతాంబర్, ఆత్మారాం, కుమ్రం కిషన్, కుమ్రం భీం, తదితరులు పాల్గొన్నారు.