అదిలాబాద్

ప్రాణాలు కాపాడటంలో 108 పైలెట్లది కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మే 26: రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంలో 108 పైలెట్లది కీలక పాత్ర అని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విజేందర్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 ఆఫీస్ యందు పైలేట్ డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రమాదం జరిగిందని, మెడికల్ కేసులు కానీ, ఆత్మహత్యలు కానీ కాల్ వచ్చిన వెంటనే సమయానికి తీసుకొచ్చి త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. 108 పైలెట్లే క్షతగాత్రుల ప్రాణాలకు రక్షకులు అని తెలిపారు. ప్రాణాలను కాపాడిన వారు ఆత్మబంధువులుగా కీర్తి సాధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల పైలేట్లు ఏవీ రావు, రాజ్‌కుమార్, రమేష్, సుధాకర్, దేవయ్య, సంపత్, కుమార్, సంతోష్, మహేందర్, రాజేందర్, ఏఎఫ్ ఈ. సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ గారు పోలీసుల వేధింపులపై స్పందించండి
* డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్‌రావు
ఆసిఫాబాద్, మే 26: అధికార పార్టీ నేతలతో కలిసి పోలీసులు పాల్పడుతున్న వేధింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిసిసి ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్ రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి మాటలు వింటూ పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌లో చేరాలని పోలీసులే తమ కార్యకర్తలను ఒత్తిడి చేయడం సిగ్గు చేటన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోవలక్ష్మి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు ఫీల్డులో ఉన్నానన్నారు. అప్పటి నుండి ప్రభుత్వానికి ప్రతి ఏటా ఇంకం ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాని ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద భవనం ఎలా నిర్మించారో ప్రజలకు చెప్పాలన్నారు. మీరు ఆరోపించినట్లుగా 100 లారీలుంటే ముక్కు భూమికి రాస్తానని విశ్వప్రసాద్ తేల్చి చెప్పారు. ఓపెన్ కాస్టు అధికారులను బెదిరించి తిర్యాణి మండలానికి చెందిన ఆరుగురు డ్రైవర్లను తొలగించిన ఉదంతంపై ఎస్పీ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.