అదిలాబాద్

మోసగాళ్లచేతిలో బలవకుండా జాగ్రత్తలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 26: మోసగాళ్లచేతిలో బలవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ శశిధర్‌రాజు సూచిం చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో డిపాజిటర్స్‌కు రక్షణ, మనీ సర్క్యూలేషన్, ఫ్రైజ్ చిట్స్ నిషేధ చట్టం - 1978 అనే అంశంపై హైదరాబాద్ అదనపు సెషన్స్ కోర్టు అదనపు పీపీ డాక్టర్ అజయ్ అధికారులకు సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోమంది ఆర్థిక వ్యవహారంలో బాధితులవుతున్నారని, మొబైల్‌ఫోన్ మీకు లాటరీ ద్వారా వచ్చిందని, మీరు కొంత డబ్బు జమచేస్తే మీకు అధికమొత్తం ధనం ఇస్తామని అనగానే అత్యాశకు వెళ్లి డబ్బులు చెల్లించడం, మోసపోవడం జరుగుతుందన్నారు. మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని, ఎలాం టి మెసేజ్‌లు వస్తే బ్యాంక్ నెంబర్, పాన్‌కార్డు నెంబర్, ఆధార్‌కార్డు నెంబర్లు చెప్పకుండా, ఆశతో డబ్బులు కట్టవద్దని వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు. కార్యక్రమం ద్వారా ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కొత్త చట్టా లు, కేసులపై అవగాహన కలిగి బాధితులకు న్యాయం చేస్తారని, అందుకోసమే అవగాహన కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, తెలంగాణ రాష్ట్రం శ్రీమతి వైజయంతి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సెమినార్‌లో సికింద్రాబాద్ నాల్గవ మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు అదనపు పీపీ శ్రీ డాక్టర్ అజయ్ చట్టంపై అవగాహన కల్పిస్తూ ఆర్థిక నేరాలు జరగడానికి గల కారణాలు, మధ్యతరగతి మనుషులలో వుండే అత్యాశ అని, కావున నేరస్తులు ఆశను ఆసరాగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని లొసుగులను ఆధారంగా ప్రతీ ఒక్కరు సెల్‌ఫోన్ వాడుతున్నందు వలన మెసేజ్‌లు, వాట్సప్, ఫేస్‌బుక్‌లలో మోసపూరితమైనవి వచ్చినప్పుడు ఎలా మోసాల నుంచి రక్షించుకోవాలో అని అవగాహన కల్పించారు. ఒకవేళ తెలిసోతెలియక డబ్బు లు పోగొట్టుకున్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అట్టి విషయంలో విచారణ జరిపి జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌కు, మెట్రోపాలిటన్ సిటీలో పోలీసు కమీషనర్లకు రిపోర్టు చేయాలని, అట్టి రిపోర్టులను ప్రభుత్వానికి నివేదించి, పాలనాపరమైన క్లియరెన్స్ వచ్చిన తర్వాత అట్టి రిపోర్టులను కోర్టులలో ఫైల్‌చేసి నేరస్థులను శిక్షించడం జరుగుతుందన్నారు. నేరస్థులకు సంబంధించిన ఆస్థులను గుర్తించి కోర్టు ద్వారా అటాచ్‌మెంట్ చేసి బాధితులకు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేశారు. ఇందులో శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ మనోహర్‌రెడ్డి, డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ జీ.బద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లా పీపీ యం.రమణారెడ్డి, అదనపు పీపీలు సంజయ్‌కుమార్, కే.శ్రీరాం, రాజ్‌కుమార్, తుకారాం, రవీందర్, అదనపు పీపీలు ఉపేందర్, దేవేందర్, పట్టణ సీఐ జాన్ దివాకర్, డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్ట ర్ నరేష్‌కుమార్, బోథ్ సీఐ జమరాం, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ సబ్ డివిజన్ల ఎస్సైలు పాల్గొన్నారు.