అదిలాబాద్

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 26: పట్టాదారు పాసు పుస్తకాల్లో పేర్ల మార్పిడికి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం నిర్మల్ మండలంలోని కౌట్ల (కే), చిట్యాల్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను మంత్రి రైతులకు పంపిణీ చే శారు. కౌట్ల (కే) గ్రా మంలో కొంతమంది రైతులు తమ వీఆర్‌వో సాదాబైనామా, విరాసత్, పట్టాదార్ పుస్తకాల్లో పేర్లు మార్చేందుకు డబ్బులు అడుగుతున్నట్లు మంత్రికి తెలిపారు. వెంటనే మంత్రి స్పందించి సంబంధిత రైతులను పిలిచి ఎవరెవరు ఎంతడబ్బులు ఇచ్చానారని అడిగి సంబంధిత గ్రామరెవెన్యూ అధికారిపై ఆగ్రహం వ్యక్తంచేసి సదరు వీఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15 వరకు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించేందుకు రెవెన్యూ సిబ్బందికి ఆదేశించడం జరిగిందన్నారు. పట్టాదార్ పాసుపుస్తకాలలో సవరణ సందర్భంగా ఎవరూకూడా ఎక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు. పెండింగ్‌లో ఉన్న విరాసత్, సాదాబైనామాలను వెంటనే పరిష్కరించి రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల్లో సంబంధిత పట్టాదార్ పేరు నమోదు చేయాలన్నారు. కౌట్ల(కె)లో 197 మంది ఇంకా చెక్కులు అందించవల్సి ఉందని, సంబంధిత రైతులకు వెంటనే అందజేయాలని ఆదేశించారు. చిట్యాల్ గ్రామంలో ఇంకా 144 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వవల్సి ఉందని వారికి కూడా వెంటనే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షురాలు దౌలాన్‌బి వౌలానా, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రాంరెడ్డి, రెవెన్యూ డివిజినల్ అధికారి ప్రసూనాంబ, ఎఫ్‌ఎసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తహసీల్దార్ శంకర్, సర్పంచ్‌లు అనిత రాజన్న, రమేష్, పాకాల రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌ను అందంగా తీర్చిదిద్దడానికి సహకరించాలి
నిర్మల్ పట్టణాన్ని అందమైన పట్టణంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రతిఒక్కరూ సహకరించాలని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని వార్డుల్లో 16 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదనలు వార్డుల వారీగా కౌన్సిలర్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ఇతర పనులు చేపట్టుటకు కావాల్సిన నిధులు తదితర అంశాలపై నివేదిక రూపొందించి చైర్మన్ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధి సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ ఏర్పాటుచేసి అందమైన పట్టణంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. వాకింగ్ ట్రాక్, అండర్ డ్రైనేజీ, తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అజింబిన్‌యాహియా, ఎఫ్‌ఎసీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కమిషనర్ రవిబాబు, మాజీ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు , తదితరులు పాల్గొన్నారు.