అదిలాబాద్

30 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూన్ 18: పట్టణంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు తరగతుల వారీగా 30 శాతం సీట్లు కేటాయించాలని ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి భీమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ కేంద్రంలో ఎస్టి ప్రజలు ఎక్కువగా ఉండటంతో పిల్లల చదువు రీత్యా ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు 30 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్థోమత లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. ప్రభుత్వం, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తక్షణమే స్పందించి ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఎస్సీలకు 30 శాతం సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి రాజలింగు, పట్టణ నాయకులు కే. వంశీ పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో
టీటీసీ, బీఈడీ వారికి ప్రాధాన్యం ఇవ్వాలి
* రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజ్ఞాషిల్
ఆదిలాబాద్ టౌన్,జూన్18: బీఈడీ, టీటీసీ పూర్తిచేసిన నిరుద్యోగులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధకులుగా మొదటి ప్రాధాన్యతనివ్వాలని, అదే విధం గా అనుభవజ్ఞులైన డ్రైవర్లు, పిట్‌నెస్ కలిగిన బస్సులను నడిపేలా చూడాలని తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజ్ఞాషిల్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం కేటాయించాలని, గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫైర్ సర్ట్ఫికెట్లు లేని పాఠశాలలను గుర్తించి, వాటి లైసెన్స్‌లను రద్దుచేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఉద యం 8.40 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగేలా చూడాలని, ప్రతి పాఠశాలలో ప్లేగ్రౌండ్, ఆట వస్తులు తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. విద్యావ్యాపారాన్ని అరికట్టి, 42,43 జీవో ప్రకారం గ్రామస్థాయిలో రూ.7వేలు, పట్టణ ప్రాంతాల్లో 9 వేల ఫీజు తీసుకోవాలన్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేవద్దని అన్నారు. పాఠశాల గుర్తింపు పత్రం నోటీసుబోర్డుపై విధిగా ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో రాహుల్, కిషన్, సునీల్, నితిన్, అజయ్, వికాస్, విశ్వజిత్, సాయి, తదితరులు పాల్గొన్నారు.