అదిలాబాద్

ఎన్నికల వాగ్దానాలు మరిచిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, జూన్ 18: తెరాస ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను మరిచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ విమర్శించారు. పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ దళితులకు మూడు ఎకరాల సాగు భూమి, రెండు పడక గదుల ఇళ్లు, విద్య,వైద్యం అందిస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల పాలనలో ఏదీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకుడు రామడుగు లక్ష్మణ్, మేదరి దేవవరం, మండల నాయకులు పెర్క రాజేష్, యాగండ్ల నారాయణ గౌడ్, పౌలు, దేవి పోషన్న, రమణారెడ్డి, జిల్లపెల్లి లింగవ్వ, భూదవ్వ, మహిళలు పాల్గొన్నారు.
వౌలిక వసతులు కల్పించాలి
లక్సెట్టిపేట, జూన్ 18: ప్రభుత్వ పాఠశాలలో వౌళిక వసతులు కల్పించాలని నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నీరేటి రామ్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎన్‌టీఎస్‌ఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఎన్‌టీఎస్‌ఎఫ్ అన్నారు. సంఘం బలోపేతం కోసం ప్రతి కార్యకర్త విద్యార్థులను భాగస్వామ్యం చేసి ముందుకు సాగాలని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గతంలో ఇక్కడి ఎస్సీ వసతి గృహం వార్డెన్ నిర్లక్ష్యం పై ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంతేకాకుండా ఆయనకే దండేపల్లి వసతి గృహాం అదనపు బాధ్యతలు ఇవ్వడం సరికాదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బోరె తిరుపతి, హారీష్, నవీన్, రమేష్, వాసు, తదితరులు పాల్గొన్నారు.