అదిలాబాద్

20న ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, జూన్ 18: ఈనెల 20న ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ బెల్లంపల్లి భాగ్ కన్వీనర్ ఏముర్ల ప్రదీప్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమన్యలు అక్రమంగా డొనేషన్లు వసూలు చేయడమే కాకుండా నెల నెల అధిక ఫీజులు వసూలు చేస్తున్నయని ఆయన ఆరోపించారు. అక్రమ డొనేషన్లు, అధిక ఫీజుల వసూలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ తరహాలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులను అప్పర్ లిమిట్‌ను ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం కేజీ నుండి ఫీజీ వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో వౌళిక సదుపాయలు కల్పించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల బంద్‌లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు అరుణ్, అంజీ, రాజేష్, బాలకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి
మంచిర్యాల,జూన్ 18: జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు ప్రభుత్వ నిబందనలను ఉల్లంఘిస్తు వేల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని ఫీజలు దోపిడిని అరికట్టాలని టివి ఎస్ జిల్లా నాయకులు డిమాం డ్ చేశారు. సోమవారం మంచిర్యాల విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మహేష్, మాట్లాడుతూ పాఠశాలలో కనీస సదుపాయాలు ఆట స్థలం, టాయ్‌లెట్స్ అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యను బోధిస్తున్నారని అన్నారు. పాఠశాలలను దుకాణాలుగా మార్చి దుస్తులు, పాఠ్య పుస్తకాలతో పాటు అమ్ముతూ అందిన కాడికి దండుకుంటున్నారని అన్నారు. విద్య సంస్థల వ్యాపార సంతలా అర్థం కాని విధంగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం ధనర్జనే ధ్యేయం గా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీవీఎస్ నాయకులు ప్రమోద్, సాయికిరణ్, శివ ప్రసాద్, అఖిల్, రాఘవ పాల్గొన్నారు.
ఆదివాసీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
ఉట్నూరు,జూన్18: ఆదివాసీ గిరిజనుల హక్కులు, వారి అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుల విగ్రహాలను ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం భీంరావు అన్నారు. సోమవారం ప్రాజెక్టు అధికారి కృష్ణఆదిత్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భీంరావు మాట్లాడుతూ అమరవీరుడు కుమురంభీం, రాంజీగోండుతో పాటు కుమురంసూరు, మాజీమంత్రి కొట్నాక్ భీంరావు, గెడం రామారావు, మెస్రం ముకుంద్‌రావు, తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఎన్నో వినతిపత్రాలు సమర్పించామని, ఐటీడీఏ ప్రాంగణంలో కావాల్సిన స్థలం ఉందని, వాటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రతిరోజు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చే ఆదివాసీ గిరిజనులకు వారి చరిత్ర తెలుస్తుందని అన్నారు. ఇకనైనా స్పందించి వారి విగ్రహాలను ఏర్పాటుచేయాలని విన్నవించారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, పెందూర్ సుధాకర్, వినాయక్‌రావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.