అదిలాబాద్

అర్జీలు స్వీకరించిన ప్రాజెక్టు అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,జూన్ 18: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. నూతనంగా పీవో బాధ్యతలు స్వీకరించి నెలరోజులు కావస్తుండగా అప్పటి నుం చి ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయోనన్న భావనతో పెద్దఎత్తున ఆదివాసీలు తరలిరావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఫిర్యాదారుల వద్దకు పీవో స్వయంగా వెళ్లి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఫిర్యాదు విభాగంలో పాల్గొనగా పలువురు ఉన్నత విద్యకోసం, రైతులు రుణాల కోసం, వ్యవసాయ పనిముట్ల కోసం అర్జీలు పెట్టుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతీ, యువకులు ఆశ్రమ పాఠశాలల్లో ఉద్యోగాల కోసం, స్వయం ఉపాధి కల్పన కోసం ఆర్థిక సాయం చేయాలంటూ వినతి పత్రాలు సమర్పించగా, సుమారు రెండవందలకు పైగా ఆర్జీలను అందజేశారు. అనంతరం ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ప్రతిఒక్క అర్జీని పరిశీలించి, అర్హులైనవారందరికీ న్యాయం చేసేలా ఆయాశాఖల అధికారులు కృషి చేయాలన్నారు. తిరస్కరించి ఫిర్యాదులపై కారణాలు తెలుపాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఏవో కనక భీంరావు, డీడీ చందన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాయిసిడాం చిత్రు, తదితరులు పాల్గొన్నారు.