అదిలాబాద్

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 18: గ్రామాల అభి వృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రధాన భూమిక పో షించే గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులను ప్ర భుత్వం వెచ్చిస్తోందన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్‌లో రూ. 16 లక్షలతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు రూ. వెయ్యి నుంచి 1500 రూపాయల పిం ఛన్లను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందజేస్తూ అదనంగా కేసీఆర్ కిట్‌ను ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు. అమ్మ ఒడి అంబులెన్స్‌ల ద్వారా గర్భిణులను ఆసుపత్రికి తీసుకరావడం, ప్రసవం అనంతరం ఇంటి వద్ద దింపడం లాంటి కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. మరోవైపు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వేలాది కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. అన్నిగ్రామాల నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు కలుపుతూ రోడ్లను, బ్రిడ్జిలను విస్తరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ వెంకట్‌రాంరెడ్డి, మూటాపూర్ పీఎసీఎస్ చైర్మన్ రామేశ్వర్‌రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.