అదిలాబాద్

లంబాడా ఉద్యోగులను.. మైదాన ప్రాంతాలకు పంపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,జూన్19: ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న లంబాడా ఉపాధ్యాయ ఉద్యోగులను మైదాన ప్రాంతానికి పంపాలని ఆదివాసీ మహిళాసంఘం ఉపాధ్యక్షురాలు బాగుబాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జీవో నెం.3ను అడ్డుపెట్టుకొని మైదాన ప్రాంతంలో ఉన్న లంబాడా ఉపాధ్యాయ ఉద్యోగులు ఇక్కడి గిరిజనేతర ఉద్యోగులను మైదాన ప్రాంతానికి పంపించి, వారి స్థానంలో లంబాడా ఉపాధ్యాయులు వచ్చి తమ ఆదివాసీ ఉపాధ్యాయులపై పెత్తనం చెలాయించేలా చూస్తున్నారని అన్నారు. ఆదివాసీ మహిళా నాయకురాలు కన్నిబాయి, భాగ్యలక్ష్మి, నాయకులు కుడ్మెత మధు పాల్గొన్నారు.
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవాలి
* ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాజన్న
కడెం, జూన్ 19: సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నీరుగారిపోతున్న ఎస్సీ, ఎస్టీ హత్యాచారాల నివారణ చట్టాన్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడానికిగాను జులై 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నిర్మల్ జిల్లా పర్యవేక్షకుడు బండపెల్లి రాజన్న పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన కడెంలోని రామాలయ ఆవరణలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం నిర్మల్ జిల్లా కడెంలో ఈనెల 25వ తేదిన ఉదయం 10 గంటలకు సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమావేశానికి ముఖ్య అథితులుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఒరుగంటి సత్యం, జిల్లా నాయకులు తోట భూమన్న, కడెం మండల అధ్యక్షులు చెవుల మద్ది రవి, దస్తురాబాద్ అధ్యక్షుడు గడ్డం గంగన్న, రాజేంధర్, భూమన్న, బొంతల పోశం, మహేంధర్, తదితరులు పాల్గొన్నారు.