అదిలాబాద్

అసంపూర్తిగా చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూన్ 19: విద్యాశాఖ అధికారుల వైఫల్యంతో ప్రభుత్వ విద్య పూర్తిగా అసంపూర్తిగా మారిందని బీఎల్‌ఎఫ్ కోకన్వీనర్ గొడిశెల కార్తీక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 315 పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక పోవడంతో, అవి తెరుకోలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలలు బలోపేతమవుతున్నాయన్నారు. జిల్లాలో సుమారు 91 ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఉపాధ్యాయులున్నా, సమయం పాటించక పోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ తెలిసినా విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని కార్తీక్ ఆరోపించారు. బీఎల్‌ఎఫ్ కమిటీ సభ్యులు దుర్గం లలిత, కవ్వాల సతీష్ పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
భీమిని, జూన్ 19: విద్యార్థులకు రెవెన్యూ అధికారులు కుల, నివాస, ఆదాయ ధృవపత్రాలను మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు జిల్లెల మహేష్ మాట్లాడుతూ కనె్నపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముం దు సిబ్బంది సరిగా లేక ఉన్న సిబ్బంది సరిగ్గా పనిచేయకపోవడంతో మండలంలోని విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పది, ఇంటర్, ఇంజనీరింగ్‌లో చేరేవారికి కుల, నివాస ఆధాయ ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్న ధృవపత్రాలు అందించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నట్లు వాపోయారు. ఇకనైనా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
తహసీల్దార్ వివరణ
విద్యార్థులకు ధృవ పత్రాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై కనె్నపల్లి తహసీల్దార్ సదానందను వివరణ కోరగా కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గతంలో పనిచేసిన ఆపరేటర్‌ను వేమనపల్లి మండలానికి బదిలీ చేశారని, ప్రస్తుతం ఉన్న ఒకే ఆపరేటర్ అన్ని పనులు చేయలేకపోతున్నామని, ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు సర్ట్ఫికేట్లు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.