అదిలాబాద్

పట్టాలు ఇవ్వాలని టవర్ ఎక్కి రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూన్ 19: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ రైతులు మంగళవారం హైటెన్షన్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మంగళవారం భూముల కోసం రైతులు పోరాటాన్ని కొనసాగిస్తునప్పటికీ అటవీ అధికారులు దౌర్జన్యంగా భూములను చదును చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ అటవీశాఖ మంత్రి జోగు రామన్న జోక్యం చేసుకొని పనులు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసిన్నప్పటికీ అధికారులు మాత్రం మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేశారు. రెండోరోజు అధికారులు పోలీస్ బందోబస్తుతో మోహరించి హరితహారం పేరిట మొక్కలు నాటడం ఎంతవరకు సమంజసమని పనులను రైతులు అడ్డుకున్నారు. దాదాపు 100 రైతులు పనులను అడ్డుకోవడంతో అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాగు చేసుకుంటున్న భూముల కోసం అటవీ అధికారులకు అడ్డు తగిలితే అరెస్టు చేస్తారా అని రైతులు, గ్రామస్తులు ఆందోళన చేసి పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనలు చేపట్టగా వారిని పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలిన అటవీ శాఖ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను పేద రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జైపూర్ ఏసీపీ సీతారాములుతోపాటు పలువురు పోలీసులు అక్కడకు చేరుకొని విద్యుత్ టవర్ ఎక్కిన వారిని కిందకు దిగాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దిగమని వారంతా పేర్కొన్నారు. అటవీ అధికారులు హరితహారం పేరుతో చేపడుతున్న పనులను నిలిపివేయాలిన డిమాండ్ చేయడంతో పోలీసులు అటవీ అధికారులతో చర్చలు జరిపారు. సాయంత్రం అటవీ అధికారులు పనులు నిలిపివేయడంతో రైతులు శాంతించారు. కాన్కూర్ శివారులో గల భూముల కోసం గత 22 సంవత్సరాలుగా పోరాటాలు సాగుతుండగా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఈ భూములు అటవీ శాఖకు చెందినవి అంటూ కితాబు ఇవ్వడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు వస్తాయని ఆశిస్తే అటవీ అధికారులు దౌర్జన్యం పెచ్చుమీరి పోతుందని వాపోతున్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందే విధంగా పట్టాలు ఇవ్వాలని భూములకు ఎట్టి పరిస్థితుల్లో అటవీ అధికారులను రానివ్వమని స్పష్టం చేశారు. అవసరం అయితే అటవీ అధికారు లు, అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.